NewsOrbit
Telugu TV Serials

గురుదక్షణ విషయంలో తగ్గేదేలే అంటున్న వసు… రిషి ప్రేమకోసం ఇల్లు వదిలి వెళ్లిపోతున్న జగతి..!

బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 565 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు 2022 సెప్టెంబర్ 27న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో జగతీ మేడమ్ విషయం,సాక్షీ విషయం అన్ని కూడా నీ మనసులో నుంచి తీసెయ్ వసుధారా అంటాడు రిషి. మన మధ్య ఇకనుండి ఎటువంటి దాపరికాలు వద్దు,నన్ను బాధించే పనులు చేయొద్దు.. అంటూ రిషి వసుని కారులో ఎక్కించుకుని తీసుకొస్తాడు. ప్రేమగా మల్లెపూలు కూడా ఇప్పిస్తాడు. అయితే ఇంటికి వెళ్లిన వసు ఆ పూలతో లవ్ సింబల్ చేసి మధ్యలో వీఆర్ అనే అక్షరాలు రాసి ఫొటో తీసి పంపిస్తుంది. అది చూసి వెంటనే కాల్ చేసిన రిషి ‘నాతో వచ్చేస్తావా వసుధారా అంటూ ఎమోషనల్‌గా మాట్లాడతాడు కానీ వసు మాత్రం.మౌనంగానే ఉంటుంది. దాంతో రిషి.అంటే నువ్వు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్న మాట బై అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో జగతీ రిషి దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటుంది.

రిషితో మాట్లాడిన జగతి :

Vasu, rishi,jagathi

అదే సీన్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. వసుధారను పోగొట్టుకోవద్దు రిషి అని అంటుంది జగతీ. మేడం అది వసుధారా చేతిలోనే ఉంది నా చేతుల్లో ఏమి లేదు మేడమ్ అంటాడు రిషి.అది నీకు చాలా ముఖ్యమైన బంధం కదా రిషి’ అంటుంది జగతీ బాధగా. ‘బంధం అంటేనే ఇద్దరి మధ్య ఉండేది.అవతల వైపు వారికి కూడా సమానంగా బాధ్యత ఉండాలి కదా మేడమ్.. తన కోసం నేను వెనకడు వేయలేను తనే ముందు అడుగు వేయాలి నిర్ణయం తనకే వదిలేసా అని రిషి అనడంతో వెంటనే జగతీ అక్కడ నుంచి వసు దగ్గరకు బయలుదేరుతుంది.

జగతి మేడంను ఎదిరించిన వసు :

Rishi, jagathi

జగతి వసు దగ్గరకు వెళ్లేసరికి వసు నిద్రలో ఉంటుంది. తలుపు కొట్టినా లేవకపోవడంతో జగతీ వసుకి కాల్ చేస్తుంది. లేచిన వసు.ఫోన్ లిఫ్ట్ చేయడంతో వసు డోర్ తియ్య అంటుంది. వెంటనే వసు వెళ్లి తలుపు తీస్తుంది. మేడమ్ మీరేంటి ఇలా అంటూ వసు కంగారు పడుతుంటే అసలు ‘రిషికి నీకు మధ్య ఏం గొడవ జరిగింది?అంటూ నిలదీస్తుంది. వసు మాట మార్చే ప్రయత్నం చేస్తే నేను రిషితో మాట్లాడాను ఏదో తుది నిర్ణయం నీదే అంటున్నాడు. అసలు ఏమైందో చెప్పు వసు అంటుంది జగతీ కోపంగా.మేడమ్.. గురుదక్షిణ విషయాన్ని రిషి సార్ మరిచిపోమంటున్నారు’ అంటూ మూడురోజులు గడువు గురించి చెబుతుంది. జగతీ షాక్ అయి ఈ గురుదక్షిణ విషయాన్ని అప్పుడే మరిచిపోవాలి కదా? రిషి అడిగే దాకా గడువు ఇచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నావ్..? నా మాట విని రిషి మాటే విను.. గొడవ పెద్దది చేసుకోవద్దు గురుదక్షిణ లేదు ఏం లేదు. రిషి నన్ను అమ్మా అని పిలవకపోయిన నాకేం ఫర్వాలేదు నువ్వు రిషి చెప్పినట్లే విను అని అంటుంది జగతీ ఆవేదనగా.

రిషి సార్ విషయంలో తగ్గేదేలే అంటున్న వసు :

Vasu, jagathi

మేడమ్.. నేను అస్సలు వెనక్కి తగ్గను అంటుంది వసు. ఎందుకు ఒప్పుకోవు వసు అలా అని రిషిని పోగొట్టుకుంటావా?’ అంటుంది జగతీ కోపంగా. ‘ఆయనే నా ప్రాణం.. ఆయన్ని ఎందుకు పోగొట్టుకుంటాను. నేను ఒకదాన్ని నమ్మాను.. అదే అభిప్రాయం మీద స్ట్రాంగ్‌గా నిలుచున్నాను’ అంటుంది వసు.జగతీ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వసు వినిపించుకోదు. వసు మాటలకూ జగతి కోపంగా ఇంటికి వెళ్లి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది వెంటనే మహేంద్ర ఏక్కడికి జగతి అంటూ కంగారు పడతాడు.

ఇల్లు వదిలి వెళ్లిపోతున్న జగతి :

Jagathi, mahendra

నా వల్ల రిషి, వసు విడిపోయేలాగా ఉన్నారు.అసలు నేను అంటూ లేకపోతే వాళ్ళ మధ్య ఏ గొడవలు ఉండవు అంటూ జగతి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే రిషి వచ్చి అడ్డుకుంటాడు జగతి మేడంని.. మేడం ఏంటిది ఇలా చేస్తున్నారు అని కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి మీరు వెళ్లాలనుకుంటే మీతో పాటే మా డాడ్ ని కూడా తీసుకుని వెళ్ళండి.

జగతి విషయంలో ఎమోషనల్ అయిన రిషి :

Rishi emotional

చిన్నప్పుడు అమ్మ లేకుండా బతికాను ఇప్పుడు నాన్న లేకుండా కూడా బతకటానికి అలవాటు చేసుకుంటాను అంటూ రిషి.ఎమోషనల్ అవుతాడు. రిషి మాటలకు జగతి మహీంద్రా ఇద్దరూ కూడా కంటతడి పెడతారు. సరిగ్గా అప్పుడే దేవయాని వస్తుంది. ఈ సీన్ మనకు బాగా ఉపయోగపడుతుంది అనుకుని జగతి మహేంద్ర దగ్గరికి వచ్చి ఎందుకు రిషిని మీరందరూ ఇలా బాధ పెడుతున్నారు అంటూ తనదైన స్టైల్ లో నాటకాన్ని రక్తి కట్టిస్తుంది.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu