Intinti Gruhalakshmi: తులసి ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే తులసి చెట్టుని శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కలంతా నీటుగా సరిచేస్తుంది. తులసి ఇంట్లోకి వెళ్లకుండానే మెట్లు మీద కూర్చుండిపోతుంది. ఆ ఇంట్లో దాచుకున్న తన వస్తువులు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సామ్రాట్ మరోసారి ఆ ఇంటి తాళం అన్ని పగలగొడతాడు. కానీ తులసి ఇంటి లోపలికి వెళ్లడానికి ఆలోచిస్తుంది. ఏం కాదు మీ జ్ఞాపకాలు మీ ఆనందంలో నుంచి మీరు బయటకు రాకండి. అదే ఆనందంతో ఇంట్లోకి పదండి అని సామ్రాట్ అంటాడు. తులసి వాళ్ళ ఇంట్లోకి వెళుతుండగా తులసికి సంగీతం నేర్పించిన తన సంగీతం మాస్టారు అక్కడికి వస్తాడు. తులసి కూడా ఆయన్ని గుర్తుపట్టి మాట్లాడుతుంది..
మీ గొంతు గుర్తుపట్టి నువ్వు వచ్చావని అనుకున్నానమ్మా తులసి అని ఆయన ఆప్యాయంగా మాట్లాడుతారు. మీరు పెట్టిన బిక్ష వల్లే నేను ఈరోజు గొప్ప సంగీతం టీచర్ గా ఎదిగాను గురువుగారు అని తులసి చెబుతుంది. నేను ఫ్యూచర్ లో స్టార్ట్ చేయబోయే సంగీతం స్కూల్ మీ చేతుల మీద గాని ఓపెన్ చేయాలని అనుకున్నాను అని చెబుతుంది. నా కోరికను మన్నించి ఆ సంగీతం స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు మీరే వచ్చి ఆ స్కూల్ ఓపెన్ చేయాలని నా కోరిక మీరు కాదని అనవద్దు అని తులసి చెబుతుంది. సరే అని ఆయన ఒప్పుకుంటారు.
లాస్య ప్రశాంతంగా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. అప్పుడే అంకిత లాస్య దగ్గరకు వెళ్ళి నా పేషంట్స్ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు. అని అంకిత అంటుంది.. దానికి లాస్య ఇది నా ఇల్లు నా ఇంట్లోకి పేషెంట్స్ వస్తే నేను కన్సల్టేషన్ తీసుకుంటాను అని లాస్య అంటుంది. అంతలో నందు అక్కడికి వస్తాడు. నీ గురించి నందు తో చెప్పనా అని లాస్య సైగ చేస్తుంది. దానికి అంకితం మౌనంగా ఉండేసరికి.. ఈ ఇంటి పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు కదా అంకిత అని నందు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. చూడు అంకిత నీ పేషెంట్స్ ఇంటికి వస్తే మాత్రం నా ఫీజు మాత్రం నేను తీసుకుంటాను అని లాస్య చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
సామ్రాట్ తులసి ఇద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. తులసి ఆ ఇల్లంతా వెతికి తను చిన్ననాటి వస్తువులను దాచుకున్న టంకు పెట్టెను తీస్తుంది. ఆ ఇనుప పెట్టిలో ఏమున్నాయి అంటే చిన్నప్పుడు తులసి వేసుకున్న బట్టలు, చిన్న చిన్న బొమ్మలు, గాజులు, కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటి గురించి తులసి వివరిస్తూ చెబుతుంది. తులసి పాపిడ బిళ్ళ పెట్టుకుని ఓ కవిత చెబుతుంది. పెళ్లి చూపుల ఫోటో గురించి వివరంగా చెబుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో శృతి టీ పెడదామని ఫ్రిజ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఫ్రిజ్ కి లాకేసి ఉంటుంది. ఇక అనసూయమ్మ పరంధామయ్యలు ఏంటమ్మా శృతి డికాషన్ ఇచ్చావ్ కానీ పాలు పోయడం మర్చిపోయావా అని అంటారు. లేదు తాతయ్య ఫ్రిడ్జ్ కి తాళం వేసి ఉంది తాళం మీ కోడలు దగ్గర ఉంది అని శృతి చెబుతుంది. అంతలో తులసి అనసూయమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అనసూయమ్మ అక్కడ జరిగింది మొత్తం అర్థమయ్యేలాగా తులసికి వివరిస్తుంది. ఇక తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!