అభి వాళ్ళ అమ్మ తులసి ను నిందిస్తుండగా.. అంకిత వచ్చి క్లాప్స్ కొడుతుంది.. అభి వాళ్ళ అమ్మ ను తన మాటలతో బాధ పెడతాడు.. అభి నువ్వు ఇక్కడికి వచ్చింది ఇందుకేనా.. ఆంటీని నిలదీసే వరకు వచ్చావా అని అంతా అనుకుంటారు.. అందరూ నన్ను తప్పు పడతున్నరు కానీ.. నేను మామ్ మంచికోసం చేశాను అంటే ఎవ్వరూ నమ్మరేంటి అని అభి వితండ వాదం చేస్తాడు..
అంకిత అభి ను చూస్తు.. మనిద్దరినీ కలపాలన మంచి ఉద్దేశంతో ఆంటీ మనల్ని ఇక్కడికి పిలిస్తే.. నువ్వు ఆంటీ కే నష్టం చేస్తున్నావు.. ఎన్ని సార్లు చెప్పాలి.. ఎలా నీకు నిరూపించుకోవాలి చెప్పు అని అవి అడుగుతాడు నిజంగా నీకు నిరూపించుకోవాలి అని ఉంటే ఒక పని చెయ్యి.. అంకుల్ దగ్గరకు వెళ్లి తను చెప్పొద్దు అంది కాబట్టే ఆంటీ నిజం చెప్పలేదు అని ఆ విషయాన్ని సామ్రాట్ గారికి చెప్పమని చెప్పు అని అంటుంది అంకిత.. ఏంటి ఆలోచిస్తున్నావు అని అంకిత అడుగుతుంది.. నిజం దాచమంది డాడీ.. ఒప్పుకుంది మామ్.. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు అని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అనసూయమ్మ నందుకు ఫోన్ చేస్తుంది. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోమని చెబుతుంది. అసలు నేనేం తప్పు చేశాను అని నందు అడుగుతాడు. తులసిని నువ్వే కదా తన మాజీ వర్త అని సామ్రాట్ తో చెప్పద్దు అని అన్నావు. ఇప్పుడు అదే మాటను సామ్రాట్ దగ్గరకు వెళ్లి చెప్పమని చెబుతుంది. అనసూయమ్మ నేనెందుకు చెబుతాను. నేను చెప్పను నేను మళ్లీ చిక్కులలో పడతాను అని నందు అంటాడు. మీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఎలాగురా మరి ఇంత స్వార్థపరుడిలాగా మారిపోయావు ఏంటి అని అనసూయమ్మ అడుగుతుంది. కొన్ని కొన్ని సార్లు అంతే అమ్మ తప్పదు అని నందు అంటాడు..
తరువాయి భాగంలో తులసి నందు వాళ్ళ ఇంటికి వెళుతుంది మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. కదా అది మీరే ఏర్పాటు చేశారని సామ్రాట్ గారితో చెప్పమని తులసి అంటుంది. నువ్వే నా మాజీ భరత్ అనే సామ్రాట్ తో చెప్పొద్దని చెప్పావని ఆ విషయాన్ని సామ్రాట్ దగ్గర చెప్పమని తులసి అడుగుతుంది. నువ్వు ఈ విషయం చెప్పమంటే నువ్వు కూడా హనీ ని కిడ్నాప్ చేసినప్పుడు నా పేరు చెప్పకుండా దాచి పెట్టావు కదా.. అప్పుడు నువ్వు కూడా తప్పు చేశావని నేను సామ్రాట్ తో చెబుతాను అని కండిషన్ పెడతాడు. అప్పుడే సామ్రాట్ అక్కడికి వస్తాడు ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!