NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Karthika Deepam 2 April 19th 2024 Episode:  శౌర్య కోసం కార్తీక్ కొన్న డ్రెస్ పట్టుకుని కార్తీక్ కారు దగ్గర దీప నిలబడుతుంది. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు దీప అని అంటాడు కార్తీక్. ఎందుకు మీరు శౌర్యకు దగ్గర అవుతున్నారు. తన విషయంలో చొరవ తీసుకుంటున్నారు. శౌర్యతో స్నేహం చేయాల్సిన అవసరం ఏంటి? జాలి చూపిస్తున్నారా అంటుంది దీప. అభిమానం అనుకోవచ్చు కదా అంటాడు కార్తీక్. దానికి ఏదైనా కావాలంటే కొనివ్వడానికి తల్లిగా నేను ఉన్నాను అంటుంది దీప. అలాగే ఒక ఫ్రెండ్ గా నేను ఉన్నానని అనుకోవచ్చు కదా అంటాడు కార్తీక్. ఎందుకు అనుకోవాలి. మీ నీడని కూడా నేను భరించలేను. మీరు కొన్న ఈ డ్రెస్ మీ మోహన కొట్టాలని అనుకున్నానని అంటుంది దీప. అలా కొడితే మీ కోపం తీరుతుందని అనుకుంటే భరించడానికి నేను సిద్ధమని అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 April 19th 2024 Episode
Karthika Deepam 2 April 19th 2024 Episode

శౌర్య చిన్నపిల్ల దానికి కొన్ని ఆశలు ఉంటాయని అంటాడు. అవి తీర్చడానికి మీరు ఎవరని నిలదీస్తుంది దీప. మా అత్త ప్రాణాలు కాపాడడానికి మీరు ఎవరని అంటాడు కార్తీక్. దేవుడి దయ వాళ్ళ ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది. కొన్ని సహాయాలకు మనసు ఉంటే చాలని చెబుతాడు. మీరు మా పాపకు దగ్గర అవడం నాకు ఇష్టం లేదని అంటుంది దీప. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు మమ్మల్ని ఇలా ఉండనివ్వమని కార్తీక్ ని కోరుతుంది. షాపింగ్ మాల్ లో అతన్ని చూశాను, శౌర్య కూడా చూసిందని నరసింహ గురించి కార్తీక్ చెబుతాడు. దీప కంగారుగా శౌర్యకి ఏమైనా చెప్పారా అంటుంది. కన్నతల్లి మీరే చెప్పనప్పుడు నేను ఎందుకు చెప్తానని అంటాడు కార్తీక్. భర్తకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అడుగుతాడు.

అతను మాట్లాడలేదు నేను ఏం మాట్లాడలేదు.  కనీసం మీరైనా ఏం జరిగిందో చెప్పండని అడుగుతాడు. తెలుసుకుని ఏం చేస్తారని అంటే నాకు తోచిన సాయం చేస్తానని చెబుతాడు. నిజంగా చేస్తారా అంటే మీరు అడిగితే అది నాకు సాధ్యం కాకపోయినా సరే చేస్తానని అంటాడు. మీరు నా కూతురికి దూరంగా ఉండాలి. ఇదే నేను మీ నుంచి ఆశించే సహాయం. ఇదొక్కటి చేయండి చాలు. ఇప్పటికే జీవితాంతం మర్చిపోలేని సహాయం చేశారు ఇది కూడా చేయమని చెబుతుంది. నువ్వు అడిగిన సాయం చేయలేను దీప ఇప్పటికే పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. ఆ చిన్న దాన్ని కళ్ళల్లో నవ్వు చూసి తృప్తి పడుతున్నాను. ఈ సాయం మాత్రం నేను చేయలేనని మనసులో అనుకుంటాడు కార్తీక్. దీప వాళ్ళని పంపించలేదని శోభ గొడవ చేస్తుంది.

రోషం, పౌరుషం లేకుండా  ఆడదానిలా బతుకుతున్నావని దారుణంగా అవమానిస్తుంది. దీప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊర్లో ఉండకూడదని తగేసి చెబుతుంది. కార్తీక్ ని గుర్తు చేసుకుంటాడు. అసలు ఎవడు వాడు ఆరోజు గుడిలో నన్ను కొట్టాడు.. పాపని షాపింగ్ కి తీసుకొచ్చాడు. నువ్వు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తా. నువ్వు నా చేతుల్లో చస్తావు. నిన్నే కాదు వాడిని కూడా వదిలిపెట్టనని అనుకుంటాడు. కోడలు కొన్న చీర చాలా బాగుందని కాంచన కొడుకుతో అంటుంది. జ్యోత్స్న నీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని తల్లితో చెప్పాలని అనుకుంటాడు కార్తీక్. కానీ కాంచన ముందుగానే జ్యోత్స్న గురించి కార్తీక్ తో మాట్లాడు. నువ్వు జ్యోత్స్న నీ నిర్లక్ష్యం చెయ్యొద్దు. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. నా ప్రేమ జీవితాంతం నాకు కావాలని స్వార్థం నాకు ఉండేది.

మా అన్నయ్యకి కూతురు పుడితే కోడలు రూపంలో ఇంటికి తెచ్చుకోవాలని అనుకున్నాను. పసుపు కుంకుమల కింద ఏం కావాలని అడిగితే కూతురు పుడితే కోడలిగా ఇవ్వమని అడిగాను. ఇచ్చేశాడు. జ్యోత్స్న అన్నయ్య కూతురు కాదు నా కోడలు. తల్లిగా నేను నిన్ను అడిగేది ఒక్కటే.. నీ విషయంలో నా కోడలి ఇష్టాన్ని ఎప్పుడు కాదనకు అని అంటుంది. తల్లి మాటలకు కార్తీక్ చాలా బాధపడతాడు. తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్తే నువ్వు ఏమైపోతావో అని అనుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి కార్తీక్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. కోడలి పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటారు. నేను నిజం చెప్తే మీరు ఏం బాధపడతారో అర్థం అయింది నేను చెప్పకూడదు పారు  తోనే చెప్పించాలని అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 2 April 19th 2024 Episode
Karthika Deepam 2 April 19th 2024 Episode

శౌర్య మంచం కింద దాక్కుని మరి బొమ్మ గీస్తుంది. దీప రావడం చూసి దాచి పెడుతుంది. ఇక నుంచి ఏం కావాలన్నా కార్తీక్ దగ్గర తీసుకోవద్దని చెబుతుంది. దీప ఇంటి ముందు చక్కగా ముగ్గు వేస్తుంది. శౌర్య వచ్చి ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది. తల్లికి బొమ్మ గీసి గిఫ్ట్ గా ఇస్తుంది. దీప తీసుకునే లోపు గాలికి ఎగిరిపోయి కార్తీక్ వాళ్ళ ముందు పడుతుంది. ఏంటి ఇదని అంటాడు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అని చెబుతుంది శౌర్య. ఈ డ్రాయింగ్ నేనే వేశానని అంటుంది. అందులో నాన్న పేరు రాసి గాలిపటం వేస్తుంది. ఈ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి నాన్న వస్తాడా అని అడుగుతుంది. దీప దాని గురించి మాట్లాడకుండా ముగ్గులో వేసేందుకు పువ్వులు తీసుకు రమ్మని చెబుతుంది. పువ్వులు పట్టుకుంటే గొడవలు అవుతాయని శౌర్య భయపడుతుంది. ఏం కాదని దీప చెప్పి పంపిస్తుంది. శౌర్య పూలు కోయబోతుంటే బంటు వచ్చి ఆపుతాడు. పూలు కొయ్యొద్దని అంటాడు. పూలు కొయ్యనివ్వడం లేదని శౌర్య చెబుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N