Malli Nindu Jabili మే 27 ఎపిసోడ్: తన కాలేజీ దెగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధులను చూసి కంగారు పడుతుంది మల్లి. మల్లికి సహాయంగా శరత్ అక్కడే ఉంటాడు, ఇంతలో మీకు మల్లి తో సంబంధం ఉందా అని మీడియా ముందు శరత్ ను వసుంధర అడగటం తో మొదలవుతుంది ఈ రోజు మల్లి నిండు జాబిలి మే 27 ఎపిసోడ్ 366. వసుంధర అలా అనడం తో కోపంగా అటు వైపు వెళ్తాడు శరత్.

Malli Nindu Jabili మే 27 ఎపిసోడ్: షట్ అప్! మల్లి గురించి తప్పుగా మాట్లాడకు
వసుంధర శరత్ మల్లి సంబంధం గురించి మీడియా ముందు అడగగానే కోపంతో షట్ అప్ నోరు ముయ్యి మల్లి గురించి తప్పుగా మాట్లాడకు అని శరత్ వసుంధరని మందలిస్తాడు. ఇదంతా అబద్ధం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయ చేసి ఎవ్వరూ నమ్మకండి అని మీడియా ప్రతినిధులతో అంటాడు శరత్.

మరోపక్క కాలేజీ ప్రిన్సిపాల్ అరవింద్ కి ఫోన్ చేసి జరుగుతుందంతా చెప్తాడు. మీకు మల్లికి ఏదో సంబంధం ఉంది అని వసుంధర గారు మీ మీద నింద వేస్తున్నారు అని ప్రిన్సిపాల్ చెప్పగానే ఇంట్లో ఉన్న అరవింద్ వెంటనే కాలేజీ కి బయలుదేరుతాడు. అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావ్ అని అనుపమ అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు అరవింద్. కాలేజీలో… ఇదంతా చేయడానికి నీకు మనసు ఎలా వొచ్చింది వసుంధర అని శరత్ అడిగితే నా కూతురు జీవితం నాశనం చేయడానికి ఆ పనిధానికి మనసు ఎలా వొచ్చింది అని మొండి సమాధానం ఇస్తుంది.

మీరు చదువుకున్న వారు…ఇలా ఎలా చేస్తారు
వసుంధర చేస్తున్న పని మల్లి కాలేజీ ప్రిన్సిపాల్ కి కూడా నచ్చదు. వసుంధర గారు మీరు చదువుకున్న వారు పైగా పెద్ద కుటుంబం నుంచి వొచ్చిన వారు, ఇది కాలేజీ ఎంతో మంది పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ ఇలాంటి పని చేయకూడదు ఇది మీ కుటుంబ సమస్య మీరు ఇంట్లోనే దీన్ని పరిష్కరించుకోండి అని వసుంధరను కడిగేస్తాడు.

పెళ్ళైన అరవింద్ తో మీకున్న సంబంధం నిజమేనా
ప్రిన్సిపాల్ అడుగుతున్నా పట్టించుకోకుండా అక్కడకు వొచ్చిన ఒక మీడియా ప్రతినిధి అరవింద్ తో మీకున్న సంబంధం నిజమేనా అని మల్లిని అడుగుతాడు. మీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలేయండి, అరవింద్ బాబుగారు మంచోడు నా కోసం భార్యని వొదులుకునేంత చెడ్డోడు కాదు అని ప్రాధేయపడుతుంది. మల్లి మాటలు పట్టించుకోకుండా లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మీ సంబంధం నిజం అని మీడియా గుచ్చి గుచ్చి అడుగుతుంది.
Malli Nindu Jabili: సత్యను దేవుణ్ణి చేసిన శరత్…మల్లికి తన ఆస్తులు రాసిచ్చేసిన శరత్…మీడియా ముందుకు మల్లి!!
Malli Nindu Jabili మే 27 ఎపిసోడ్: మీరు అరవింద్ ను ప్రేమిస్తున్నారా
మీరు అరవింద్ ను ప్రేమిస్తున్నారా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని ప్రశ్నలు వొస్తూనే ఉంటాయి, ఇంతలో అక్కడికి వొచ్చిన అరవింద్ స్టాప్ ఇట్ అని గట్టిగ అరుస్తూ మీడియా ప్రతినిధుల దెగ్గరికి వొస్తాడు. అరవింద్ ని చూసిన వసుంధర ‘రా నీకోసమే వెయిటింగ్ దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఇక్కడకి రప్పించాను’ అని మనసులో అనుకుంటుంది. అరవింద్ మల్లి దెగ్గరకు వెళ్లి చేతులు పట్టుకొని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

కనీస ఇంగిత జ్ఞానం లేదా
మీడియా ప్రవర్తన చూసిన అరవింద్, వెన్నక్కి జరగండి కెమెరాలు బంద్ చేయండి అని అడుగుతాడు. మీకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చిరాకు పడతాడు. అప్పుడు వసుంధర ఇలా అంటుంది ‘కామన్ సెన్స్ కలిగిన ప్రముఖ జర్నలిస్ట్ కూడా వొచ్చాడు ఆయనను కూడా అడగండి’ అని. ఈ అమ్మాయికి మీకీ ఎమ్ సంబంధం అని అరవింద్ ని అందరూ అడుగుతారు. ఈ అమ్మాయి కోసం మీరు మీ భార్యని వదిలేస్తున్నారు అని అడుగుతారు. అరవింద్ కోపం తో బ్రెయిన్ పాడైందా మీకు ఎవరో ఏదో చెప్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అమాయకురాలిని పట్టుకొని ఇలా వేధిస్తారా అని నిలదీస్తాడు అరవింద్.

ఇదే కాలేజీలో చదువుకుంటుంది మల్లి, మీరు చేస్తున్న ఈ పని వాళ్ళ రేపు ఈ కాలేజీలో తోటి స్టూడెంట్స్ తో లెక్చరర్స్ తో ఎలా మాట్లాడగలుతుంది అని మీడియాని అడుగుతాడు. క్యారెక్టర్ మీద బురద చల్లి మీ పాటికి మీరు ఏదో రాసుకుంటారు రేపు తన పరిస్థిథి ఏమిటి, మా మధ్య సంబంధం ఉంది మీ దెగ్గర ఎం ఆధారాలు ఉన్నాయి, చేతిలో కెమెరా ఉంది కదా అని ఇష్టం వొచ్చినట్లు చేస్తారా ఇదేనా జర్నలిజం అంటే అని అందరిని కడిగేస్తాడు అరవింద్. ప్రిన్సిపాల్ కూడా అరవింద్ కి మద్దతుగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిని క్లాస్ కి వెళ్ళమని చెప్తాడు. ఏడుస్తున్న మల్లిని ఓదారుస్తూ నువ్వు బయపడకు ఎవరు ఎంత ప్రయత్నించినా నేను నిన్ను కాపాడతాను అని అంటాడు అరవింద్. బాగా దెగ్గరకు వొచ్చి ఫోటోలు తీస్తున్న మీడియా వ్యక్తి కెమెరా ను పడేసి ఎం చేసుకుంటావో చేసుకో పో అని అంటాడు.

Malli Nindu Jabili మే 27 ఎపిసోడ్: అరవింద్ ఇంటికి చేరిన డ్రామా
ఇలా కొంచెం సేపు ఆ కాలేజీ దెగ్గర డ్రామా జరుగుతుంది. అరవింద్ వసుంధర మధ్య కూడా కొంచెం మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తరువాత మల్లిని తీసుకుని అరవింద్ ఇంటికి బయలుదేరుతాడు. అక్కడ ఇంట్లో ఈ బాగోతం అంతా టీవీ లో న్యూస్ చానెల్స్ చూసి తెలుసుకుంటారు అరవింద్ కుటుంబ సభ్యులు. అక్కడే అరవింద్ ఇంట్లో ఉన్న కాంచన కూడా ఈ వార్త చూసి నోరు వెళ్ళపెడుతుంది.

ఇది చూసిన మాలిని కూడా వెంటనే వసుంధరకు ఫోన్ చేసి ఎందుకు ఇలా చేసావు ఒకవేళ మల్లినే తన భార్య అని అరవింద్ చెప్పేసి ఉంటె ఎం జరిగేదో ఆలోచించావా అని అడుగుతుంది. శరత్ వసుంధర కూడా అరవింద్ ఇంటికి చేరుకుంటారు. తన కుటుంబసభ్యులు అడిగే ప్రశ్నలకు తవరలోనే మీకు సమాధానం దొరుకుంది అని సమాధానం ఇస్తాడు అరవింద్. మరో పక్క శరత్ మాలిని ని ఇదంతే నీ తప్పు మాలిని అని అంటాడు. ఇదంతా జరుగుతుండగా ఎక్కడ నిజం బయట పడి ప్లాన్ రివర్స్ అవుతుందో అని మాలిని వసుంధర కంగారు పడతారు. అక్కడ కాలేజీ లో మీడియా వాళ్లు మల్లితో ఆదుకున్నది చాలు ఇక్కడ మీరు మొదలు పెట్టకండిఎం మల్లికి ఆల్రెడీ పెళ్లి అయిపొయింది అని చెప్పి మల్లి మేడలో ఉన్న తాళిని బయటకు లాగుతాడు అరవింద్. ఇక ఆ తరువాత కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో తెలియాలి అంటే సోమవారం రోజు రానున్న మల్లి నిండి జాబిలి కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూడక తప్పదు. అంతవరకు సెలవు తిరిగి కొత్త ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.