NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపి ప్రగతి – సంక్షేమ పథకాలు వివరించిన సీఎం జగన్

న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. పలు ప్రతిపక్షాలు నీతి ఆయోగ్ బేటీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం సాధించిన ప్రగతి – అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై నివేదికను సమర్పించారు. అనంతరం సమావేశంలో ప్రసంగిస్తూ భారత్ లో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉందనీ, లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతం గా ఉందన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందన్నారు. ఆమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితం అయ్యిందని చెప్పారు.

ap cm ys jagan speech in niti aayog governing council meet

 

ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే రవాణా వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గడచిన తొమ్మిదేళ్లలో సరుకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తొందనీ, మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న వ్యయం ప్రశంసనీయమన్నారు. ఏపి కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టిందనీ, ఇందులో భాగంగా కొత్త గా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తొందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు అభవృద్ధి చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తొందని వెల్లడించారు.

niti aayog governing council meet

జీడీపీ పెరుగుదలలో సేవలు, తయారీ రంగాలే కీలకమని వ్యాఖ్యానించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, తద్వారా 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం పై దృష్టి పెట్టామని చెప్పారు. వైద్యరంగంలో కీలకమన సంస్కరణలు తెచ్చామని సీఎం తెలిపారు. ఏపీలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చామని వివరించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని చెప్పారు. తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

సమ్మిళిత వృద్ధి సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకమనీ, మహిళలకు ఆర్ధిక వనరులు, అవకాశాలను పెంపొందిచడానికి ఏపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రాలు కూడా ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్ర శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని జగన్ అన్నారు.

YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట .. బుధవారం వరకూ ఆరెస్టు చేయవద్దు

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N