Malli Serial Today Episode, ఏప్రిల్ 17: నేను కూడా నీలానే ఒంటరి జీవితం బ్రతికేద్దాం అని అనుకుంటున్నా అంటూ మల్లి డైలాగ్ తో మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 17 ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. మల్లి ఇలా అనగానే అరవింద్ ఇంకా మాలిని కంగుతిన్న మొహంతో ఎక్స్ప్రెషన్స్ పెడతారు. బాబు మల్లి ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని పక్కన తల్లి అరవింద్ ను అడుగుతుంది. దానికి బదులుగా అరవింద్ ఎవరి నిర్ణయాలు వారివి ఎవరి కంగారు వారిది ప్రేక్షకుడినై మౌనంగా ఉండటం తప్ప నా చేతుల్లో కూడా ఎం లేదు అత్తయ్య అని సంధానం ఇస్తాడు.

అందరూ వినండి ఈ సీతరాముల సాక్షిగా అరవింద్ బాబు గారిని మాలిని గారిని ఒక్కటి చేద్దాం అని నిర్ణయించుకున్నాను అని పెద్ద బాంబు పిలుస్తుంది మల్లి. ఇది విని అక్కడ ఉన్న వారు అంతా షాక్ కి గురవుతారు. అందులో మాలిని తల్లి మాత్రం ఏడుస్తూ ఆశ్చర్యం తో మాలిని ఆ? పంతులమ్మ గారి పేరు కల్పన కదా అని మల్లి ని అడగటం తో మల్లి నిండు జాబిలి సీరియల్ కథ మరో అంకానికి చేరుతుంది.

కల్పనా అని నీ దెగ్గర అబద్ధం చెప్పింది మాలిని అంటూ తల్లికి వివరిస్తుంది మల్లి. మాలిని అమ్మ గారు కల్పన అమ్మగారు ఒక్కరే అని అనడం తో మల్లి తల్లికి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో మాలిని తో జరిగిన ఒక ఫోన్ కాల్ గుర్తువొస్తుంది. నేను అరవింద్ భార్య మాలిని ని అని అప్పుడు మాలిని ఫోన్ లో చెప్పిన విషయం గుర్తు వొస్తుంది. మీరా మల్లికి పిచ్చి ఏమైనా పట్టిందా? కట్టుకున్నోడిని ఇంకో ఆడదానికి కట్టబెడతా అంటుందేంది అని అక్కడ ఉన్న పెద్ద మనిషి ప్రేశ్నిస్తాడు. మన ఉరి ఆచారం కట్టుబాట్లు గురించి మర్చిపోయినవా ఏందీ, ఈ విషయం సత్యకు గాని తెలిసింది అంటే… అని అంటాడు.

అందరి దృష్టి లో నేను అరవింద్ గారి భార్యనే అయి ఉండొచ్చు, కానీ అరవింద్ గారి అసలు భార్య ఈ మాలిని అమ్మగారే అని మల్లి అంటుంది. ఏడేళ్ల నుండి ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ దృరదృష్టం కొద్దీ మన ఆచారాలకు తలొగ్గి అరవింద్ గారు ముందు నా మేడలో తాళి కట్టారు. ఇందంతా వింటున్న అక్కడ మండపం దెగ్గర ఉన్న జనాలు చెవులు కోరుక్కోవటం మొదలు పెడతారు, కాంతమంది అక్కడే నిలదీస్తారు.
బలవంతంగా కట్టిన తాళి కంటే ప్రేమతో కట్టిన తాళికే ఎక్కువ విలువుంటుంది- మల్లి సీరియల్ ఏప్రిల్ 17వ ఎపిసోడ్ లో మల్లి చెప్పిన మాటలు
బలవంతంగా కట్టిన తాళి కంటే ప్రేమతో కట్టిన తాళికే ఎక్కువ విలువుంటుంది, నా మేడలో అరవింద్ బాబు గారు కట్టిన తాళి తీసేసి అరవింద్ బాబు గారిని మాలిని అమ్మ గారిని ఒక్కటి చేస్తాను అని మల్లి అంటుంది

ఇలా జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి గన్ పట్టుకుని వొచ్చిన సత్య ను చూసి అందరూ బిగుసుకు పోతారు. సమయానికి వొచ్చినవ్ సత్య మన మల్లి ఎలాంటి పనులు చేస్తుందో చూడు అంటూ సత్యకు ఫిర్యాదు చేస్తుంది మల్లి తల్లి మీర. నేను అంతా చూసాను అంతా విన్నాను మీరా అంటాడు అక్కడ ఉన్న మల్లిని చూస్తూ సత్య.
బాపు నా మేడలో ఉన్నది తాళి కాదు కేవలం తాడు మాత్రమే. మాలిని అమ్మ గారి మేడలో ఉన్నదే అసలు తాళి అని సత్య తో చెప్తుంది మల్లి. మల్లి న్యాయంగా ఆలోచిస్తుంది మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అంటూ ఏడుస్తున్న మాలిని ని చూసి ఏది న్యాయం పరిస్థితులు ఎలా ఉన్న ఒక్కసారి ఒక ఆడదాని మెడలో తాళి కట్టిన తరువాత ఆ తాళిని కాదని ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడం న్యాయమా అని ప్రేశ్నిస్తాడు సత్య. ఎవరిది స్వార్ధం ఒక అమాయకురాలి జీవితం నాశనం అయినా పరవాలేదు నేను మాత్రం సంతషంగా ఉండాలి అని నువ్వు అనుకోవటం స్వార్ధం అని సత్య అంటాడు.

Bramhamudi : అపర్ణకు షాక్ ఇచ్చిన రాజ్.. స్వప్న ఎంట్రీతో కావ్య కష్టాలు వస్తాయా?
ఇంకో మాట మాట్లాడబోతున్న మాలిని ని ఆపేస్తాడు అరవింద్. ఈ సమస్యను మీరు పెద్దది చేస్తున్నారు ఈ సమస్య గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు సందర్భం కాదు అని ఇద్దరిని ఉద్దేశించి అంటదు అరవింద్.
అరవింద్ చెప్పినా వినకుండా మాలిని ఏడుస్తూ సత్య తో మాటల యుధం చేస్తుంది. మీ కూతురు కాబట్టి మల్లి ని సమర్థిస్తున్నారు మరి నా మెడలో ఉన్నది తాళి కాదా నాకు న్యాయం జరగొద్దా అని ప్రేశ్నిస్తుంది. మల్లి స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్న ఆ ఆడపిల్లకె న్యాయం జరగాలి అని అంటాడు సత్య. ఎందుకంటే మొదట తాళి కట్టిన ఆడదానికే ఆ మొగవాడు సొంతం కావాలి అని సత్య సమర్ధించుకుంటాడు …. ఆ తరువాత ఇంకొంచెం కథ సాగుతుంది చివరిగా అరవింద్ వ్రతం మీద కూర్చుంటాడు … పూర్తి మల్లి సీరియల్ టుడే ఎపిసోడ్ యూట్యూబ్ ఇక్క చూడండి.
Nuvvu nenu prema: విక్కీకి కృష్ణ గురించి నిజం తెలిసిపోతుందా? పద్మావతి ప్రేమను బయటపెడుతుందా?