NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సుజనా”చౌదరి” అలా..! సోము వీర్రాజు ఇలా…! పార్టీ ఒకటే, స్వరాలు వేరు..!

ఏపి మూడు రాజధానుల అంశంలో బీజేపీ నేతలు ఇంకా ద్వంద వైఖరినే కొనసాగిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నది తమ పార్టీ స్టాండ్ అంటూనే, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని ఒకరు, ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని మరొకరు స్పష్టం చేస్తుండటం ప్రజల అయోమయానికి, ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏమన్నారు..

ఏపీ రాజధాని అంశం ముమ్మాటికీ కేంద్రం పరిధిలోనిదే. అమరావతిని రాజధానిగా గతంలోనే కేంద్రం గుర్తించింది. ఆర్టికల్‌ 254 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉంటే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి. ప్రస్తుతం గవర్నర్‌ పరిశీలనలో ఉన్న బిల్లులు కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వీటిని గవర్నర్‌ కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదిస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుంది. అమరావతి నుంచి రాజధాని అంగుళం కదలదు.

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమన్నారంటే..

రాజధాని వికేంద్రీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల విషయంలోనే కలుగ జేసుకుంటుంది. దేశంలో అనేక రాష్ర్టాలలో కొత్త రాజధానులు ఏర్పాటు చేస్తున్నా.. కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు.
గతంలో నాటి సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తేనే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చారు. అమరావతిపై చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానుల విధానం చేపడితే కేంద్రం జోక్యం చేసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం జరగకుండా పోరాడతాం.

బీజేపీ జాతీయ పార్టీ. మొదటి నుండి ఆ పార్టీలో భిన్న నాయకులు, భిన్న మనస్తత్వాలు, భిన్న వాదనలు ఉంటూనే ఉంటాయి. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చినా అదే తంతు కొనసాగుతుంది. రాజధాని విషయంలో అదే గందరగోళం కొనసాగిస్తున్నారు. సుజనా చౌదరి మాట చెల్లుతుందా? చెల్లదా?, సోము వీర్రాజు మాట చెల్లుబాటు అవుతుందా? ఇద్దరిలో ఏది బీజేపీ వాదన?, ఒకరి వాదన కరెక్ట్ అనుకున్నప్పుడు మరొకరిని నోరు మూయించే పరిస్థితి బీజేపీలో లేదా? పార్టీ పరంగా మాట్లాడుతున్నారా? వ్యక్తిగతం గా మాట్లాడుతున్నారా? అనేది ముందుగానే బీజేపీ నిర్ధారించుకొని నాయకుల చేత మాట్లాడించాలి. లేకపోతే ఇటువంటి గందరగోళ పరిస్థితే వస్తుంది. రాజధాని విషయంలో మొదటి నుంచి బీజేపీ వైఖరి ఇలాగే ఉంది.

Related posts

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk