Lotta Peesu: మన చుట్టుపక్కల రబ్బరు మొక్కలు తారసపడుతూ ఉంటాయి.. ఇది గులాబీ రంగు పూల ను కలిగి ఉంటాయి.. ఈ చెట్టు ఎక్కువగా నీరు ప్రవహించే ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది.. ఈ మొక్క ను రబ్బరు మొక్క, లొట్ట పీసు మొక్క, పాల సముద్రపు మొక్క అని రక రకాలుగా పిలుస్తూ ఉంటారు.. లొట్ట పీసు మొక్క వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..!!
Lotta Peesu: ఈ చెట్టు పాల తో తేలు కాటు విషానికి చెక్..!!
లో టాకీస్ మొక్క నిలువెల్ల విషాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ దీనిలో ఉండే ఔషధ గుణాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ చెట్టు కు సంబంధించిన ఏ పదార్థాన్ని నోట్లో వేసుకోకూడదు. కేవలం పైపూతగా మాత్రమే వాడితే చక్కటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ చెట్టు లో ఎక్కువగా పాలు ఉంటాయి. ఈ చెట్టు ను పెంచితే పాలు వస్తాయి. ఈ పాల ను తేలు కుట్టిన చోట రాస్తే తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. శరీరానికి విషం పాక నివ్వకుండా చేస్తుంది. పాలను గజ్జి తామర ఉన్న చోట పైపూతగా రాస్తే త్వరగా తగ్గిపోతాయి.

ఈ మొక్కలను ఎక్కువగా కాగితం తయారీ లో ఉపయోగిస్తారు. ఈ మొక్క కర్రలు తీసుకువచ్చి ఎండబెట్టాలి. ఇంట్లో కర్రతో సామ్రాణి వేసుకుంటే దోమల బెడద ఉండదు. ఈ చెట్టు పైన హానికర క్రిములు ఏవి ఉండవు. ఈ చెట్టు ఆకులను కనీసం పశువులు దాణాగా కూడా తినవు. ఎందుకంటే ఇది అంత విషపూరితంగా ఉంటాయి. అయితే ఈ చెట్టు పాలు మాత్రం పైపూతగా వాడితే పలు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఈ చెట్టు కొమ్మ విరగ తీసి నీటిలో వేసినా కూడా ఈ చెట్టు ఏపుగా పెరుగుతుంది. అదే ఈ మొక్కలో ఉన్న మరో ప్రత్యేకత.
పూర్వ కాలం నుండి ఈ ఈ చెట్టు తో తయారు చేసిన మందును వరి పంటకు పిచికారి చేస్తే దోమల బెడద ఉండదని మన పెద్దలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ చెట్టు ఆకులతో ద్రావణాన్ని తయారు చేసి పంట మొక్కలకు పిచికారి చేస్తున్నారు. ఇందుకోసం 10 కిలోల ఆకులను తీసుకుని ఒక మట్టికుండలో వేయాలి. అందులో 10 కిలోల గోమూత్రం రెండు కిలోల ఆవు పేడ వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం 7 కిలోలు అయ్యేవరకు బాగా మరిగించాలి ఈ ద్రావణం చల్లారిన తరువాత ఇందులో రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ ను కలపాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక బకెట్ లో నిల్వ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పిచికారి చేయాలి. ఇలా తయారు చేసుకున్న కేవలం రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇది గమనించి ఇది తయారు చేసుకున్న వెంటనే వరి మొక్కల మొదల్లో పిచికారి చేయాలి. వరి పొలంలో దోమల నివారణకు ఈ ద్రావణం అద్భుతంగా పని చేస్తుంది.