NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ABN RK: టీడీపీని నిలువునా ముంచేస్తున్న ఏబీఎన్ ఆర్కే..! చంద్రబాబు సీరియస్ సందేశం..!?

IAS Lakshmi Narayana: Scam Share to ABN RK..?

ABN RK: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలూ లేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా వైెెఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు మరో రెండున్నరేళ్ల వరకూ ఎటువంటి ఢోకా లేదు. ఎన్ డీ ఏ గూటిలో లేడన్న మాటే గానీ కేంద్రంలోని బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదంలో జగన్ సహకరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో జగన్మోహనరెడ్డికి ఆమేర కొన్ని విషయాల్లో కేంద్రం నుండి సహకారం అందుతూనే ఉంది. అయితే రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ ను అస్తిర పరిచి పూర్తి టీడీపీని ఏదో విధంగా పైకి తేవడం కోసం ఓ సెక్షన్ మీడియా (టీడీపీ అనుకూల మీడియాా) తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు ..అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది మొదలు ఇక జగన్ బెయిల్ రద్దు అవుతుంది,. జైలుకు వెళ్లడం ఖాయం, ఆయన జైలుకు వెళితే ముఖ్యమంత్రి ఎవరు, వైసీపీలో సీఎం పీఠం కోసం చీలిక వస్తుందా ఇలా వారికి ఇష్టం వచ్చినట్లు డిబేట్ లు నిర్వహించాయి. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. రఘురామ కృష్ణంరాజు పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఏబీఎన్ కొత్త బాణీ అందుకుంది. రోజుకో డిబేట్ తో పూత గడుపుకునే ఏబీఎన్ లో నిన్న ఒక వింత, వెరైటీ డిబేట్ తో టీడీపీ వాళ్ళు కూడా తిట్టుకునే స్థాయికి వెళ్లారు..!

ABN RK: ABN is Enough to Destroy TDP..?
ABN RK ABN is Enough to Destroy TDP

ABN RK: బీజేపీతో పొత్తు అంటూ.. కొత్త కథలు..!!

టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదనీ బీజేపీ నేతలు ఓ పక్క ఘంటాపదంగా చెబుతుంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, దానికి జనసేన తో మధ్యవర్తిత్వం జరుగుతోందంటూ ప్రచారాన్ని తెరపైకి తీసుకువస్తోంది. బీజేపీలో చేరినా పసుపు వాసన వదులుకోని ఒకరిద్దరు ఎంపీల మాటలను పట్టుకుని ఏబీఎన్ దీనిపై డిబేట్ ను నిర్వహించింది. వాస్తవానికి కేంద్రంలోని వైసీపీకి రాజ్యసభలో ఉన్న బలం కారణంగా బీజేపీ దూరం చేసుకునే పరిస్థితి లేదు. వచ్చే సంవత్సరం జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలోనూ వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. ఆరు నెలల తరువాత రాజ్యసభ లో బీజేపి బలం తగ్గుతుంది., మరో పక్క వైసీపీకి రాజ్య సభ సభ్యుల బలం పెరుగుతుంది. భాగస్వామ్య పక్షం కాకపోయినా ఎన్ డీ ఏకి వైసీపీ సహకరిస్తోంది. పట్టుపని పది మంది ఎంపీలు కూడా లేని టీడీపీతో స్నేహం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి బీజేపీకి లేదు. అయినప్పటికీ బుద్ది జ్ఞానం అనేది లేకుండా తనకు వచ్చిన ఐడియా పార్టీలు, ప్రజలపై రుద్ది కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం .టీడీపీ – బీజేపీ పొత్తు అంటూ ఏబీఎన్ కొత్త పాట పాడుతోంది. ప్రాంతీయ పార్టీలో బీజేపికి అనుకూలంగా ఉంటున్నది జగన్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ కు బద్ద వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అసాధ్యమే. ఈ చిన్న లాజిక్ ఏబీఎన్ ఆర్కే కు తెలియక కాదు. తెలిసి కూడా ఇటువంటి వార్తలు వండి వారుస్తున్నారు.

ABN RK: ఎందుకు ఏబిఎన్ ఆర్కే ఇటువంటి రాతలు..!?

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేసినా తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్, పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ తన హవా కొనసాగించింది. ఈ తరుణంలో టీడీపీలో జోష్ నింపడానికి,. పడుకున్న తెలుగుదేశం క్యాడర్ ను లేపడానికి, టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ లో ఒక భయం అనేది వస్తుందన్న భావనతో తన మనసులో వచ్చిన వార్తలను ఎబీఎన్ లో ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రధానంగా కన్ఫూజన్ క్రియేట్ చేయడం కోసం పెయిడ్ ఆర్టికల్స్ ను ప్రమోట్ చేస్తున్నాడని టాక్.

ABN RK: ABN is Enough to Destroy TDP..?
ABN RK ABN is Enough to Destroy TDP

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు నాశనమే కదా..!?

ఏపిలో బీజేపీ పూర్తిగా ఐసీయులో ఉన్నట్లే. ఎందుకంటే 2014లో ఎన్ డీ ఏలో తెలుగుదేశం పార్టీ ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో నాలుగేళ్లు (ఎన్ డీ ఏ) బీజేపీతో కలిసే ఉంది. అయినప్పటికీ 2014 నుండి 2019 వరకూ ఏపికి బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇచ్చింది ఏమీ లేదు. రాజధాని గానీ, పోలవరం ప్రాజెక్టు గానీ ఏమి ఇవ్వలేదు. అప్పటికీ బీజేపీపై వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఎన్ డీ ఏ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత మోడీని, అమిత్ షాను, బీజేపీని విపరీతంగా టార్గెట్ చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేంద్రంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నా రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఏమి చేయడం లేదు. ఏమి ఇవ్వడం లేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చకపోవడం తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు ఆమోదం తెలుపడం, రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టులు, పరిశ్రమలు మంజూరు చేయకపోవడం ప్రజలు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీతో కలవడానికి టీడీపీ కూడా అంత సాహసం చేయదు. ఒక వేళ కేంద్రంలో అధికారంలో ఉండి ఓశక్తి గా ఉన్నందున వ్యక్తిగత ప్రయోజనాల కోసం దగ్గర అయ్యేందుకు ప్రయత్నించవచ్చు గానీ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం కలిసే అవకాశాలు లేవు,. ఏ రాజకీయ పార్టీ బీజేపీతో పొత్తుకు ఇష్టపడరు..!

ABN RK: ABN is Enough to Destroy TDP..?
ABN RK ABN is Enough to Destroy TDP

నూటికి నూరు శాతం తప్పుడు కథనమే..!!

బీజేపీ – టీడీపీ పొత్తు అంటూ ఏబీఎన్ డిబేట్ నిర్వహించడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానిక్ మ్యాజిక్ ఫిగర్ 123..! ప్రస్తుతం బీజేపీకి 92 మంది మాత్రమే ఉన్నారు. ఎన్డీఏలో ఇతర భాగస్వాములు, వైసీపీ సాయంతో ప్రతీ బిల్లు గట్టెక్కుతుంది. రాజ్యసభలో మోడీ, అమిత్ షాకి చెమటలు పడుతున్నాయి. వచ్చే మే నెల నాటికి బీజేపీకి 76కి తగ్గుతారు. వైసీపీకి మరో ముగ్గురు పెరుగుతారు. ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ(12), డీఎంకే(10)తర్వాత వైసీపీ(9)కి ఎక్కువ సభ్యులుంటారు. టీఎంసీ, డీఎంకే బీజేపీకి మద్దతివ్వడం అసాధ్యం. అందుకే వైసీపీ, టీఆరెస్ లాంటి పార్టీలు వారి అవసరాల దృష్ట్యా మద్దతిస్తారు. 2024 వరకు కేంద్రానికి జగన్ అవసరం తప్పనిసరి.బీజేపీ – జగన్ బంధం క్లియర్ గా ఉంటే.. ఇంకా “టీడీపీ – బీజేపీ” పొత్తు అని వార్తలు అల్లడం ఏంట్రా బుర్రలేని బొషీడీకే..! జగన్ కి బెయిల్ కేసుల నుండి గట్టెక్కించింది బీజేపీ, ఈ రాష్ట్రంలో హిందూ విగ్రహాల సెంటిమెంట్ ద్వారా బీజేపీ ఎదగడానికి సహకరించింది వైసీపీ! జగన్ సీబీఐ కేసుల నుండి కాపాడుతున్నది బీజేపీ.., రాజ్యసభలో బేషరతుగా బీజేపీ బిల్లులకు తలొంచి మద్దతిస్తున్నది వైసీపీ! ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా “టీడీపీ – బీజేపీ”పొత్తు అని ఎప్పుడో 2024 కోసం ఇప్పటి నుండి వార్తలు అల్లడం ఏమిటి..? అంటూ టీడీపీ పెద్దల నుండి సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు ఏబీఎన్ కూడా కాస్త కంట్రోల్ లో ఉంటె మంచిది అంటూ చంద్రబాబు నుండి సందేశాలు వెళ్లాయని సమాచారం..!

author avatar
Srinivas Manem

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!