Aloe Vera: మీరు ఎప్పుడైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఈ మొక్క కనిపిస్తే వేర్లు కూడా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి..!!

Share

Aloe Vera: ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్కల లో కలబంద ఒకటి.. దీని గుజ్జు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. ఆనాది కాలం గా కలబంద గుజ్జు చర్మ, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు.. కలబంద గుజ్జు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..!! కలబంద గుజ్జు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే అనర్ధాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

 

Aloe Vera: Health Benifits and Don't Do's
Aloe Vera: Health Benifits and Don’t Do’s

Aloe Vera: కలబంద ఆరోగ్యప్రయోజనాలు..!!

కలబంద లో గ్లిజరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సార్బిటోల్ వంటి అనేక పోషకాలు కలిగి ఉంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మం కాంతివంతంగా చేయడంలో దోహదపడుతుంది. కలబంద లోని సపోనిన్స్ యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. శరీరం లోని బ్యాక్టీరియా వైరస్ లను నాశనం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరానికి కావలసిన 22 యాసిడ్స్ లో 20 కలబంద  లోనే దొరుకుతాయి. దీని ద్వారా ఎసిడిటి సమస్యలు, దీర్ఘకాలిక మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు కలబందలో పన్నెండు రకాల క్రిమినాశక లు ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలు, కడుపు నొప్పి, లివర్ సమస్యలు, మధుమేహం, రక్తహీనత, ఎముకల బలహీనత, కడుపు సంబంధిత సమస్యలు, వంతు వికారం నుంచి కాపాడుతుంది. ఇందులో జీర్ణశక్తికి కావాల్సిన లవణాలు, ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం లోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

Aloe Vera: Health Benifits and Don't Do's
Aloe Vera: Health Benifits and Don’t Do’s

Aloe Vera: కలబంద గుజ్జు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు..!!

అతి ఏదైనా ప్రమాదమే.. పరగడుపున కలబంద గుజ్జు తినడం వలన బరువు తగ్గుతారని, దీనిని తీసుకుంటే దీని వలన శరీరం డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలబంద రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల  శరీరం లో  పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి. దీనివలన గుండె పనితీరు మందగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. స్కిన్ కోసం ఎక్కువగా కలబందను ఉపయోగిస్తుంటే చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. అలా వస్తే వెంటనే కలబంద గుజ్జు ను ఉపయోగించడం మానేయండి. చాలా రోజుల నుంచి కలబంద తీసుకుంటుంటే అది బీపీని తగ్గించేలా చేస్తుంది. బీపీ తక్కువగా ఉన్నా కూడా అనారోగ్యమేనని గుర్తించండి.. గర్భిణీ స్త్రీలు కలబందను తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇందులో ఉన్న పాలిచ్చే ఆస్తి గర్భిణీ స్త్రీలకు హానికరం. అంతేకాకుండా గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్నప్పుడు కలబంద రసం తాగమని చాలామంది చెప్తూ ఉంటారు. అలా తీసుకోవడం ఆపేయండి. దీనిలో భేది మందులు ఉంటాయి. దీని వల్ల కడుపు నొప్పి, విరోచనాలు అవుతాయి. కలబందను ఎక్కువ రోజులు నిరంతరంగా తీసుకోకూడదు.. అవసరం ఉన్నంత వరకే దీనిని తీసుకొని ఆ తర్వాత ఆపేయాలి.


Share

Related posts

Big Boss: ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో స్పెషాలిటీ ఇదేనట..!!

sekhar

Mahesh Babu: మహేష్ బాబు తో మరోసారి నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ భామ..!!

sekhar

Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

sridhar