Bigg Boss Telugu OTT: డిస్నీ హాట్ స్టార్ బిగ్ బాస్ ఓటిటి దుమ్ము లేపుతోంది. గత శనివారం ప్రారంభమైన ఈ షోలో 17మంది కంటెస్టెంట్ లో ఎంట్రీ ఇవ్వగా.. మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ కి ఏడుగురు నామినేట్ అయ్యారు. హౌస్ లో ఫస్ట్ రోజు నుండే బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు జట్లుగా .. డివైడ్ చేసి హీట్ బిగ్ బాస్ పెంచేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
ఈ మాజీలు అందరూ ఒక టీం. వీళ్ళ టీం పేరు వారియర్స్. ఇక కొత్త కంటెస్టెంట్ లు.. చూస్తే వాళ్ళ టీం పేరు చాలెంజర్స్. దీంతో ఈ రెండు టీంల మధ్య పోటా పోటీ వాతావరణం ఉండేలా.. సరికొత్త టాస్క్ లు ఇస్తున్నారు. కాగా సోమవారం బిగ్ బాస్ ఓటిటి మొదటి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్టయింది. ఈ క్రమంలో ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి నామినేట్ అయిన సభ్యులు.. అరీయన, అర్జే చైతు, హామిదా, నటరాజ్ మాస్టర్, సరయూ, ముమైత్ ఖాన్, మిత్రశర్మ. మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది.
భారీగానే ఒకరిపై మరొకరు డైలాగులు కారణాలు చెప్పుకోవటం జరిగింది. బిగ్ బాస్ ఓటిటి చూస్తే కొద్దికొద్దిగా ఇంట్రెస్ట్ కలిగేలా ఉంది. ప్రస్తుతం మెల్లమెల్లగా కొత్త కొత్త స్నేహాలు కలగటం మాత్రమే కాక కొత్తగా శత్రువులు కూడా హౌస్ లో ఏర్పడే పరిస్థితి కనబడుతోంది. 84 రోజులు షో జరగనున్న క్రమములో మొదటి వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.