బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎందుకు దగ్గర అవుతారో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో దూరమవుతారో కూడా ఊహించలేం. ఇట్టే దగ్గరవుతారు…. అలాగే దూరమై పోతారు. ఇప్పుడు నాలుగో సీజన్ లో కూడా అదే జరుగుతోంది. మొదటినుండి అభిజిత్, అరియానా లకు పెద్దగా పడదు. రెండు మూడు వారాలు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ వచ్చారు. ఒకరిపై ఒకరు బాగా కోపంగా ఉన్నట్లు అనిపించింది. అయితే ఐదవ వారంలో సమీకరణాలు పూర్తిగా మారాయి.
అభిజిత్ ఒక మాట అనడం, అరియానా ను పిలవడం ఇద్దరు కలిసి డాన్స్ చేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మొదటి వారాంతంలో నాగార్జున ఇచ్చిన ఒక టాస్క్ లో అభి ని చెత్తబుట్ట అంటూ అరియానా అభివర్ణించింది. డస్ట్ బిన్ మెడల్ ను అభిజిత్ మెడలో లో వేసింది. అక్కడి నుండి మొదలైన ఆ వైరం అయిదో వారం వరకు కొనసాగుతూనే వచ్చింది. టాస్క్ విషయంలో అయితే ఏదో ఒక రకంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి. వీరి మధ్య సఖ్యత లేనేలేదు.
అయితే ఐదవ వారం వీకెండ్ లో ఆడిన ఆటలో అభి వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యాడు. ఒక పాటను ప్లే చేసి నీకు నచ్చిన వారితో డాన్స్ చేయమంటే అందరూ అభిజిత్ హారిక ను పిలుస్తాడు అని అనుకున్నారు. కానీ అతను అరియానా ను పిలిచాడు. వెంటనే ఆమె కూడా షాక్ తో కూడిన సంబరం చూపించింది. ఉత్సాహంతో అభి తో డాన్స్ చేయకుండా మాటలతో గాలిలో తేలిపోయింది. నన్ను పిలుస్తావని అసలు ఊహించలేదని ఎగ్జైట్ అయింది.
మామూలుగా మా ఇద్దరి మధ్య అంత చనువు కూడా లేదని నాగార్జునతో చెప్పేసింది. ఇక అభిజిత్ బర్త్ డే సందర్భంగా అరియానా అతని కోసం ప్రేమగా కేక్ తయారు చేసింది. కేక్ కట్ చేసే అభి నోట్లో పెడుతూ తెగ సంబరపడిపోయింది. హ్యాపీ బర్తడే అని గట్టి గట్టిగా అరుస్తూ అభిని కౌగిలింతలతో కట్టిపడేసింది. చూస్తుంటే త్వరలోనే అభి-అరియానాల మధ్య కొత్త ట్రాక్ నడిచేలా కనిపిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ట్రాక్ అయినా సవ్యంగా సాగుతుందా లేదా గందరగోళం గా మారుతుందా అనేది చూడాలి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!