బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ 6 వ వారం లోకి ఎంటర్ అవుతుంది. ఇక సభ్యుల మధ్య వాడి వేడి పెరగడంతో రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతోంది. గడిచిన మూడు సీజన్ల కంటే కూడా ఈసారి ఎక్కువ వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో నిర్వాహకులు చేస్తున్న ప్రయోగాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి.
మొదటి నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు తప్పటడుగులు వేశారని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒక్క స్టార్ సెలబ్రిటీ కూడా లేకపోవడంతో నెగెటివ్ కామెంట్స్ రావడంతో మొదటి రెండు వారాల్లో రేటింగ్స్ పై భారీగా ప్రభావం చూపినట్లు అయింది. వెంటనే షో ను నిలబెట్టేందుకు వరుసగా వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చేశాయి .ఆ తర్వాత నాగార్జున హోస్టింగ్ పై హైప్ క్రియేట్ చేయడం…. ఇంటిలో విన్నూత టాస్క్ లు ఇవ్వడంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని కలుగజేశాయి.
ఇక ఇప్పటివరకూ షో లో బాగా క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరు అంటే గంగవ్వ అని చెప్పాలి. ఇక ఆరోగ్య సమస్యలు దృష్ట్యాగంగవ్వ వెళ్ళిపోతుంది. ఆమె స్థానంలో మరొకరిని తీసుకువచ్చే అవకాశం ఇప్పుడు ఉందట. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి, అవినాష్, దీక్షిత్ వచ్చిన వారానికే స్వాతి బయటకు వెళ్ళిపోయింది. గంగవ్వ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒక స్టార్ సెలెబ్రెటీని లోనికి తీసుకుని వచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
ఎంతో పాపులారిటీ ఉన్న స్థానంలో ఒక స్టార్ ని తీసుకొని వస్తే ఆట మరింత రక్తి కడుతుందని వారి ఆలోచన అన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఒక క్లారిటీ రావాలంటే ఈరోజుటి ఎపిసోడ్ పై ఒక చూపు వేయాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!