తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లోకల్ హీరోయిన్లు దొరకడం చాలా కష్టం. అసలు తెలుగు అందం తెరపై కనిపించడమే చాలా అరుదు. అచ్చమైన తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కు అంతగా అవకాశాలు రావట్లేదు. వచ్చినా స్టార్ హీరోయిన్ లుగా ఎదగడంలో విఫలమవుతున్నారు.
అయితే ఈషా రెబ్బా అనే హీరోయిన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. సినిమాల్లో మరీ పెద్ద పెద్ద ఛాన్సులు రాకపోయినా.. అంత ప్రముఖ్యమైన పాత్రలు వేయకపోయినా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భలే ఉంది. ఆమె అందాన్ని సోషల్ మీడియాలో ఆరాధించే వారి సంఖ్య లెక్కకు మిక్కిలి. అలాగని తనేమి స్కిన్ షో చేయడం కానీ…. పొట్టి బట్టలతో ఎక్స్పోజింగ్ చేయడం కానీ చేయదు.
ఏ ఫోటో షూట్లు ఇచ్చినా చీర కట్టుతోనే తన అందంతో కుర్రకారు పిచ్చెక్కిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు వేస్తుంది కానీ అవీ లిమిట్ గానే. ఈమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ మధ్యనే తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక విషయాన్ని చెప్పింది ఈషా. ఇంస్టాగ్రామ్ స్టోరీలో కొన్ని కొంటె ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
ఎప్పుడైనా ఎవరైనా మీకు ముద్దు పెడతా అంటే తిరస్కరించారా? అని ఆమెకు ప్రశ్న ఎదురవడంతో కాస్త సిగ్గు పడింది. అలా సిగ్గు పడుతూనే అవును తిరస్కరించాను అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఆమెను ముద్దు కోరిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. అలాగే పరీక్షల్లో ఎప్పుడైనా కాపీ కొట్టావా అని అడిగితే చాలా సార్లు కొట్టాను అంటూ చెప్పేసింది.