తన తండ్రి అలా పెంచారని చెప్పిన నాగబాబు.. ఎలాగంటే!

పిల్లలు మంచి వ్యక్తిత్వంతో, సేవా గుణంతో పెరగాలంటే అందులో తల్లిదండ్రులు పాత్ర కీలకమైనది. పిల్లల పెంపకం విషయంలో కొంతవరకు వారిని స్వేచ్ఛగా వదలాలి. అలా వదిలినప్పుడు మాత్రమే వారిలోని నైపుణ్యం బయటపడుతుంది. పిల్లల విషయంలో తన తండ్రి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, వారితో కొంత సమయం కేటాయించాలని, మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా తమ పెంపకం విషయంలో తన తండ్రి వ్యవహరించడం శైలిని ఆయన గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో మా నాన్న మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. ఈ పరీక్షలో కచ్చితంగా చదవాలి, పాస్ అవ్వాలని ఆకాంక్షలను పెట్టలేదు. పాస్ అయితే చాలు అని చెప్పే వారు.ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే తన తండ్రి ఎంత లోకజ్ఞానం కలిగి ఉండేవారనీ, మాపై ఎటువంటి ఒత్తిడి లేకుండా మాకు స్వేచ్ఛ ఇచ్చేవారిని నాగబాబు తెలిపారు. అన్నయ్య సినిమాలలోకి రావడానికి నాన్న పూర్తిగా మద్దతు తెలిపి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు.

ప్రస్తుతం నా జీవితంలో నేను ఒక ప్రముఖ నిర్మాతగా స్థిరపడటానికి అన్నయ్య కారణమని తెలిపారు.మేము చేసేటటువంటి పనుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్ఛ కల్పించేవారని ఈ సందర్భంగా నాగబాబు తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.అయితే ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా తమ పిల్లలకు ఏమవుతుందో అని కంగారు పడిపోతుంటారు. ఆ పిల్లలను ఎండలో ఆడన్నివ్వరు, వర్షంలో తడవనివ్వరు.

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇలాంటి ఆంక్షలను తమ పిల్లలకు విధిస్తున్నారు. అయితే వారికి స్వేచ్ఛనిచ్చి ప్రకృతిని ఆస్వాదించేలా చేస్తే, వారిలో దాగివున్న నైపుణ్యం బయటపడుతుంది.అలాగే సంవత్సరానికి ఒకసారైనా పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లడం ద్వారా ఎంతో అనుభూతిని పొందుతారు. పిల్లల్ని పెంచేటప్పుడు వారిని సున్నితంగా కాకుండా, ఎటువంటి సమస్యలైనా ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొని పరిష్కరించేంత ధైర్యాన్ని వారిలో నింపాలి. అయితే పిల్లలు ఈ విధంగా పెరగాలంటే రోజులోఒక గంట పాటు అయిన తండ్రి పిల్లలకి సమయం కేటాయిస్తే వారిలోని శక్తిసామర్ధ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీయవచ్చని ఈ సందర్భంగా ఈ తరం తల్లిదండ్రులకు నాగబాబు సూచనలిచ్చారు.