‘ఆరనీకుమా ఈ దీపం..కార్తీక దీపం’..తెలుగు డీజే పాటలలో ఇది చాలా ఫేమస్. కాని ఈ పాట వింటే మనకు గుర్తొచ్చేది మాత్రం వంటలక్క పాత్రలో ఉన్న దీప మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండోయ్.. తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇట్టే కట్టిపడేస్తుంది. సీరియల్స్ లో ఎటువంటి సీన్ నైనా పండించడంలో తనకు తానే సాటి. ఎమోషనల్ సీన్ ను తనకు మించి ఎవరూ చేయలేరన్నట్టుగా ఆమె తన ప్రతిభను కనబరుస్తూనే ఉంది. అందుకే కదా వంటలక్క అంటేనే ఒక ట్రెండింగా మారిపోయింది.
దీనికి నిదర్శనమే మన వంటలక్క సీరియల్ దేశం మొత్తం మీద నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఈ క్రెడిట్ మాత్రం మన వంటలక్కదేనని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండోయ్.. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్, ఐపీఎల్ షో లకు దక్కని రేటింగ్ మన వంటలక్క కార్తీక దీపానికే దక్కడంలోనే మనం అర్థం చేసుకోవచ్చు మరీ వంటలక్కకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేది.
ప్రతి వారం ఈ సీరియల్ కు వచ్చే నెంబర్ వన్ రేటింగే చెబుతుంది మన దీప ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటుందనేది. మరీ ముఖ్యంగా ఎలాంటి అంద చందా లు వలకబోయకుండా, గొప్ప వేషాధారణ కూడా లేకుండా ఒక సాధారణ గృహిణి గానే ఉంటూ కేవలం తన నటనతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్న బుల్లితెర యాక్టర్ దీప. తన వాక్ చాతుర్యంతో స్టార్ లనుంచి సాధారణ జనాలను సైతం తన వైపు చూపు మరల్చుకోకుండా చేస్తున్న ఫేమస్ యాంకర్ సుమ కనకాల. తన షో లతో అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ తన వైపు తిప్పు కునే ఒకే ఒక్క యాంకర్ సుమా.
అయితే ఇలాంటి ఇద్దరు బుల్లి తెర స్టార్స్ వంటలక్క సుమక్క కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను యాంకర్ సుమా పోస్ట్ చేసి ఈవెంట్ ఏంటో చెప్పుకోండి చుద్దాం అంటూ సవాలు విసిరింది. ఏ ఈవెంట్ విషయమై ఈ ఫోటో దిగారో తెలియదు కాని ఇది చూస్తే మాత్రం బుల్లితెర స్టార్ లు కలిసి తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నట్టు అర్థమవుతోంది. చూడాలి మరీ వంటలక్క , సుమక్క కలిసి చేసే అల్లరి ఎలా ఉంటుంది అనేది.
https://www.facebook.com/SumaKanakala/photos/a.595261383897730/3447032692053904/
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!