నాని ‘అంటే…. సుందరానికీ’ సినిమా స్టోరీ లీక్….!

వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నేచురల్ స్టార్ నాని తర్వాత చిత్రం ‘అంటే… సుందరానికీ’ టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో మంచి దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రచించి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కథ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి…

 

నాని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ అంశాలను ఈ చిత్రంలో ఉండేలా చూసుకునే నాని కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ‘అంటే…. సుందరానికీ’ టైటిల్ లా నానీ గెటప్ కూడా అందుకు తగ్గట్టే సరదాగా వినోదంగా ఉంది. ఇక విలక్షణాత్మక చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఎటువంటి స్క్రిప్టు రాసి వున్నాడు అని ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక సంగీతంభరిత వినోదాత్మక ప్రేమ కథ అని అర్థం అవుతోంది.

బయట ప్రచారంలో ఉన్న కథ విషయానికి వస్తే… ‘అంటే… సుందరానికీ’ సినిమాలో నాని ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపిస్తారని హిందూ కుటుంబంలో పుట్టిన అతను క్రిస్టియన్ మతానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతనికి ఏర్పడిన పరిస్థితులు చాలా హాస్యభరితంగా ఉండబోతున్నాయని అంటున్నారు. క్రిస్టియన్ అమ్మాయిని హిందూ అమ్మాయి గా తన ఇంట్లో పరిచయం చేసిన హీరో ఆ తర్వాత పడే ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అన్నది కథాంశం అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కథ అయితే ఇదే. నాని పంచకట్టులో లగేజ్ బ్యాగ్ పట్టుకొని బ్యాక్ సైడ్ నుండి చూపించారు కెమెరా సైకిల్ బూట్లు తోలు బొమ్మలు కనిపిస్తున్నాయి

అయితే ఇదే కనుక నిజమైన కథ అయితే ఈ స్టోరీ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ నుండి అల్లరి నరేష్ వరకు చాలా మంది ఇలాంటి సినిమాలను తెరపై చూపించారు. ఇక నాని ఇటువంటి స్టోరీలో ఎంతో నేచురల్ గా చేసే నటన కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నాడు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.