బిగ్ బాస్ సీజన్ 4.. ప్రతి రోజు సరికొత్తగా ఉంటుంది. గతంలో ఉన్న సీజన్స్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ రోజు రోజుకు షో అద్భుతంగా మారుతుంది. ఇక మొన్న నామినేషన్స్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా జరగగా నిన్న బిగ్ బి హోటల్ అనే టాస్క్ జరిగింది. ఇక ఈ టాస్క్ లో అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బి హోటల్ ని దారుణంగా తయారు చేశాడు. అనవసరంగా స్పందిస్తూ బిగ్ బాస్ హోటల్ కి దారుణమైన పేరు తీసుకొస్తున్నాడు.
ఇది పక్కన పెడితే.. బిగ్ బాస్ టాస్క్ ఇవ్వకముందు హౌస్ లో ఓ అద్భుతమైన సన్నివేశం జరిగింది. అయితే ఈ సన్నివేశం ఆన్ సీన్ లో ఉండటం ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ కిచెన్ లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో అవినాష్ తినే సమయంలో అరియనా పక్కన కూర్చోగా లాస్య వంట చేస్తుంది. ఇక అప్పుడు పిచ్చి పిచ్చిగా అరియనా పాట పాడుతూ తినిపించాలని అవినాష్ ని అడగగా అవినాష్ తినిపించాడనికి ఒప్పుకోలేదు.
దీంతో అరియనా స్పందిస్తూ.. మనసులో ఏదో పెట్టుకున్నావు.. అందుకే నాకు తినిపించట్లేదు అంటూ పదే పదే అనడంతో ఇది వదిలేలా లేదు అంటూనే అవినాష్ తినిపించాడు. ఇంకా ఆ సమయంలోనే హారిక స్పందిస్తూ.. ఎవరో బెదిరిస్తే తినిపించకు అంటూ కామెంట్ చేసింది. ఇక అప్పుడే అరియనా పాటలు పడుతూ.. బిగ్ బాస్ ఐ లవ్ యు అంటూ చెప్పగా కెమెరా అటువైపు తిరిగిపోయింది. దీంతో అరియనా బిగ్ బాస్ ఏంటి ఇది అని అడగగా.. అవినాష్ ఆమెపై సెటైర్ వేస్తూ.. బిగ్ బాస్ లా మిమిక్రి చేశాడు. ”మీరు నాకు ఐ లవ్ యు చెప్పినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను.. ఇలా మీరు ప్రతిసారీ ఐ లవ్ యు చెబితే మిమ్మల్ని ఎలిమినేటి చెయ్యాల్సి ఉంటుంది” అంటూ బిగ్ బాస్ లా మిమిక్రి చేశాడు. ఇక వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ లా కనిపిస్తున్నప్పటికీ వచ్చే వారం ఇది ఏ రిలేషన్ లా మారుతుంది అనేది చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!