చాలామందికి కాయగూరలులో నచ్చని కాయ కాకరకాయ. కాకరకాయ అనగానే చాలామంది చీదరించుకుంటారు. ఎందుకంటే అది చేదుగా ఉండటం వల్ల తినడానికి ఇష్టపడరు. నిజానికి చేదు ఏ ఆరోగ్యాన్నికి ఎంతో మేలు చేస్తుంది. అది తెలియక నోటి రుచి కోసం ఎంతోమంది కాకరకాయను పక్కన పెడుతారు. ఇక డయాబెటిస్ తో బాధపడేవారికి శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెడుతుంది. అంతేకాదు కాకరకాయ తినడం వల్ల శరీరంలో శక్తి కూడా అమాంతం పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇక అలాంటి కాకరకాయను వర్షాకాలంలో రెండు రోజులకు ఒకసారి తీసుకుంటే ఎంతో మంచిదని నిపుణులు తెలిపారు. కాకరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కాకరకాయలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల శరీరానికి వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. కాకరకాయ వల్ల జీర్ణవ్యవస్థ బావుంటుంది. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
కాకరకాయను తరచూ తీసుకోవడం వల్ల దగ్గు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండవు. కాకరకాయలో కేలరీలు, కొవ్వులాంటి పదార్థాలు ఎక్కువగా ఉండవు. కాకరకాయలు తినడం వల్ల రక్తంలో చెడు పదార్థాలను శుభ్రపరుస్తాయి. కాకరకాయ కేవలం ఆరోగ్యాన్నే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాకరకాయ పచ్చిగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ లు సోకకుండా కాపాడుతుంది.