Job Alert: ప్రస్తుత రోజుల్లో బయట ఉద్యోగం సంపాదించడం చాలా కష్టతరం అయిపోయింది. ముఖ్యంగా మహమ్మారి కరోనా కారణంగా చాలా కంపెనీలు మూత పడిపోతూ ఉండటంతో .. ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి. సో బయట ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడతుందో… ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో బయట వాతావరణం ఉంది. దీంతో మల్టీ నేషనల్ కంపెనీలు… కోవిడ్ పరిస్థితులను బేరీజు వేసుకుని వర్క్ ఫ్రొం హోమ్ దిశగా ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ దిశగా మల్టీ నేషనల్ కంపెనీలో టాప్ మోస్ట్ కంపెనీ TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్… ఏదైనా డిగ్రీ ఉంటే చాలు చేత 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు సంవత్సరం ఆదాయం కింద ఇవ్వటానికి రెడీ అవుతూ ఉద్యోగాలు కల్పిస్తోంది.
ఇక జాబు రోల్ చూసుకుంటే.. బ్యాక్ ఆఫీస్ సపోర్టు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. సో ఎక్సెల్ మీద అదే రీతిలో వెబ్ సెర్చ్ పైన అవగాహన ఉంటే చాలు. అయితే ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటినుండి ఉద్యోగాలు కల్పిస్తున్న తరుణంలో బయట పరిస్థితులు మారాక వాళ్ళు ఎక్కడ లొకేషన్ అంటే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసే సమయంలో మనం దగ్గరలో ఉండే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
TCS అధికారిక వెబ్ సైట్ లో.. అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు.. మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి…, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వయసు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్.. తమ ఎక్స్పీరియన్స్ వివరాలు తెలియజేయాలి. ఆ తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ నమోదు చేయాలి అదే విధంగా హాబీస్ అడుగుతారు దాన్ని కూడా పూర్తి చేయాలి. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా RESUME నీ గూగుల్ డ్రైవ్ ద్వారా సెండ్ చేయాలి. ఈ రీతిగా ఇంటినుండే ఉద్యోగాలు పొందడం ఏవిధంగా టాటా కన్సల్టెన్సీ కంపెనీ.. కొత్త ఉద్యోగాలకు ఓపెనింగ్స్.. తీస్తోంది.