ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీదున్న మినిమమ్ గ్యారెంటీ హీరో మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఇప్పుడు అసలు బాగోలేదు. రీసెంట్గా రిలీజైన అమర్ అక్బర్ ఆంటోని మూవీపై రవితేజ ఫ్యాన్స్ భారీ హోప్సే పెట్టుకున్నారు కానీ ఈ మూవీ కూడా నిరాశపరచడం మాస్ హీరోని, అతని ఫ్యాన్స్ ని చాలా డిజస్పాయింట్ చేసింది. ఇక మార్కెట్ పూర్తిగా దెబ్బతింటున్న టైములో ప్రయోగాల బాటపట్టిన రవితేజ, డిఫరెంట్ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ తో ‘డిస్కో రాజా’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
రవితేజ పుట్టినరోజున డిస్కో రాజా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ సినిమా పోస్టర్ అందరినీ మెప్పించింది. రవితేజ ఇప్పటివరకూ చేయని జానర్లో… సైంటిఫిక్ కథతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో తండ్రీకొడుకులుగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేయబోతున్న రవితేజ, అందుకు తగ్గట్లు రెడీ అవుతున్నాడు. కొత్త జోనర్, రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేయడం వరకూ బాగానే ఉంది కానీ ఎప్పుడో ఒకసారి రాజా ది గ్రేట్ సినిమాలో ప్రయోగం చేస్తే హిట్ అయ్యింది కదాని ప్రతిసారీ ప్రయోగం చేస్తాను అంటే కష్టం, చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు.
రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునేది వినోదం, వేరే ఏ హీరోకీ లేని కామెడీ టైమింగ్ రవితేజ సొంతం. ఆ టైమింగ్ తో వచ్చే ఫన్ కోసమే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తారు. కిక్ సినిమాలో దొంగగా చేసినా, రాజా ది గ్రేట్ మూవీలో అంధుడిగా కనిపించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు అంటే అందులో ప్రయోగంతో పాటు వినోదం కూడా ఉంది. డిస్కో రాజా సినిమాలో కూడా రవితేజ ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ ఉంటే పర్వాలేదు కానీ అవి మిస్ అయితే మాత్రం కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో ప్రయోగాలు అవసరమా అనే విమర్శ ఫేస్ చేయాల్సి వస్తుంది. రవితేజ ఇది తెలుసుకోని సినిమా చేయడం బెటర్ లేదంటే అతి త్వరలో అతని కెరీర్ క్లోజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!