NewsOrbit
న్యూస్

జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆ శక్తి లేదట ! ఏమిటది ? ఎవరన్నారు??

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒంటికాలిపై లేచే కొడాలి నాని ఈసారి కూడా టిడిపిని టార్గెట్ చేశారు.

Even junior NTR lacks that power What is it Someone
Even junior NTR lacks that power What is it Someone

అదేమీ వార్త గానే కాదు. ఆ వ్యాఖ్యలకు జూనియర్ ఎన్టీఆర్ ను ముడి పెట్టటమే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొడాలి నాని సాంబ అదుర్స్ సినిమాలు తీశారు జూనియర్ ఎన్టీఆర్ వల్లే కొడాలి నానికి మొదట టిడిపి టిక్కెట్ లభించి౦దని కూడా చెబుతారు. కాలక్రమంలో కొడాలి నాని వైసీపీలో చేరిన మంత్రి వరకు ఎదిగినప్పటికీ ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఇప్పటివరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి నాని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ .ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు చేపట్టినప్పటికీ ఆ పార్టీకి భవిష్యత్తు ఉండబోదట.

అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే టీడీపీకి భవిష్యత్ లేదని.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆ పార్టీ కోలుకోలేదని కొడాలి నాని తేల్చేశారు. ఏపీలో టీడీపీ పుంజుకునే ప్రసక్తే లేదన్నారు.టీడీపీకి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని.. ఇప్పుడు ఎవరు వచ్చినా,చివరికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగినా టీడీపీని కాపాడలేరని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.తాను టీడీపీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ తో ముందుకుసాగానన్నారు. కానీ 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత హరికృష్ణను పక్కనపెట్టడం.. జూనియర్ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని నాని మండిపడ్డారు.

టీడీపీలో మనుగడ కష్టమని భావించే వైసీపీలో చేరానని మంత్రి వివరించారు. అప్పటి విషయమైతే చెప్పలేను గానీ ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ సైతం టిడిపి ని బతికించలేరన్నారు.తెలంగాణలో టీడీపీ తుడుచిపెట్టుకుపోయిందని.. ఏపీలో సరైన పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. నాని కామెంట్స్ టిడిపిలో కూడా ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N