NewsOrbit
Featured న్యూస్

భారత్ మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు అటల్ జీ: మోదీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రెండో వర్థంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళుల్పరించారు. భారతదేశం కోసం వాజ్ పేయి చేసిన సేవలకు మోదీ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. వాజ్ పేయికి నివాళులర్పించారు.

అటల్ జీ పుణ్య తిథి రోజు ఆయనకు నివాళులర్పిస్తున్నా. భారతదేశ అభివృద్ధి కోసం మీరు చేసిన సేవలను భారత్ ఎప్పటికీ మరిచిపోదు… అంటూ వాజ్ పేయిని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దానితోపాటు వాజ్ పేయి ఫోటోలతో కూడిన ఓ వీడియోను కూడా మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అంకిత భావంతో పనిచేసిన రాజకీయవేత్త, బీజేపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వాజ్ పేయి అని మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. భారతరత్న వాజ్ పేయి అంటేనే దేశభక్తి, భారతదేశ సంప్రదాయాలకు మారుపేరు అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు.

వాజ్ పేయి భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతుంది. తరతరాలు కూడా వాజ్ పేయిని గుర్తు పెట్టుకుంటాయి.. అని మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఆదివారం ఉదయమే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి వాజ్ పేయి స్మృతి చిహ్నం ‘సదైవ్ అటల్’ వద్దకు వెళ్లి వాజ్ పేయికి నివాళులర్పించారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju