NewsOrbit
రాజ‌కీయాలు

ఈ ఉత్తరాంధ్ర నాయకుడి అలకకి కారణం ఇదేనా..?

dharmana prasada rao getting shocks by cm jagan

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మేటి నాయకుడు, మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర, అద్భుత వాక్పటిమ‌‌, దివంగత వైఎస్ హయాంలో ఆయనకు సన్నిహితుడు.. ఇవన్నీ రాజకీయ దురంధరుడు ధర్మాన ప్రసాదరావు సరిపోయే మాటలు. రాజకీయాల్లో ఇంత ఘన చరిత్ర ఉన్న ఆయన ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యేగానే ధర్మాన ఉండిపోవవటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. సొంత అన్నయ్య నుంచే కాకుండా జిల్లాలోని రాజకీయాల ద్వారా కూడా ఆయనకు రాజకీయ సెగ తగలుతోందని అంటున్నారు.

dharmana prasada rao getting shocks by cm jagan
dharmana prasada rao getting shocks by cm jagan

జూనియర్లు కూడా మంత్రులు అయిపోతున్నారు..

తన కళ్ల ముందు ఎదిగిన వారే ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నా ఆయన మాత్రం ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారు. జగన్ తనను కాదని అన్నను మంత్రిని చేశారు. ఇటివల ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లినప్పుడు ఏర్పడిన ఖాళీలో కూడా ప్రసాదరావుకు చోటు దక్కలేదు. తన ముందు ఎంతో జూనియర్ అయిన సిదిరి అప్పలరాజుకు మంత్రి పదవి లభించింది. పుష్పశ్రీ వాణి కూడా మంత్రిగా ఉన్నారు. అన్నకు ప్రమోషన్ వచ్చి ఏకంగా డిప్యూటీ సీఎం హోదా దక్కింది. దీంతో ప్రసాదరావు లోలోపలే కుమిలిపోతున్నారని అంటున్నారు. ఇప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కడం అనుమానమే అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు ఆయన గతంలో చేసిన కొన్ని పనులు.. ప్రస్తుత వ్యవహారాన్ని జగన్ నిశితంగా పరిశీలించడమే కారణం అంటున్నారు.

అప్పుడు, ఇప్పుడు ప్రసాదరావు వ్యవహారశైలే కారణమా..

2009 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నయ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ధర్మాన ప్రసాదరావు. దీంతో నరసన్నపేట నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు కృష్ణదాస్. ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ మరణం తర్వాత రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. 2010లో కాంగ్రెస్ తో విభేదించి జగన్ వైఎస్సార్సీపీ ప్రారంభించారు. జగన్ ను నమ్మి వెళ్లిపోయిన వారిలో కాంగ్రెస్ నుంచి గెలుపోందిన కృష్ణదాస్ కూడా ఉన్నారు. కానీ.. ప్రసాదరావు వెళ్లలేదు. కాంగ్రెస్ పని అయిపోయాక 2015లో వెళ్లారు. అప్పటి ఉప ఎన్నికల్లో కృష్ణదాస్ వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్ నుంచి మరో తమ్ముడు రామ్ దాస్ ను నిలబెట్టారు ప్రసాదరావు. ఇది జగన్ కు నచ్చలేదని అంటున్నారు. ఇటివల విజయసాయిరెడ్డి సమక్షంలోనే ‘తల, తోక లేని మొండెం’ మాకెందుకు అంటూ జిల్లాల విభజనపై ఆయన ఖచ్చితమైన అభిప్రాయం వెలిబుచ్చడం కూడా జగన్ కు ఆయన మనసులో ఉందని అంటున్నారు. ఈ కారణంగానే ప్రసాదరావును జగన్ దూరం పెట్టారని అంటున్నారు.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!