NewsOrbit
రాజ‌కీయాలు

ఒకప్పటి రాజకీయ ఉద్దండుడుని జగన్ అవమానిస్తున్నారా..?

daggubati venkateswara rao problems with cm jagan

ఆయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు. ప్రతి పల్లెకు తెలిసిన పేరు. ఎన్టీఆర్ కు స్వయానా అల్లుడు. 5సార్లు ఎమ్మెల్యే, 2సార్లు ఎంపీగా పని చేసినా ఆ రాజకీయ దురంధరుడు. ఆయన భార్య రెండుసార్లు ఎంపీగా.. ఓసారి కేంద్రమంత్రిగా పని చేశారు. ఇంత చరిత్ర ఉన్న నాయకుడే దగ్గుబాటి వెంకటేశ్వర రావు. వీరిని ప్రస్తుతం జగన్ పట్టించుకోవట్లేదు. మొన్నటి ఎన్నకల్లో ఓడిపోయిన తర్వాత దగ్గరకు కూడా రానీయలేదు. ఆ సీనియర్ నాయకుడిని జగన్ అవమానిస్తున్నారా. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

daggubati venkateswara rao problems with cm jagan
daggubati venkateswara rao problems with cm jagan

దగ్గుబాటి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే..?

దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1990 నుంచి 2010 రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అధికార పార్టీల్లో ఉన్నారు. రాజకీయంగా ఘన చరిత్ర ఉంది. అయినా.. 2019లో వైసీపీ గాలి ఉన్నా పర్చూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. స్వతాహాగా చేసిన తప్పులు, పరిస్థితులు మారడం, నమ్మినవారు పక్కకు వెళ్లిపోవడం ఆయన తొలి ఓటమికి కారణాలయ్యాయి. దీంతో ఆయన జీర్ణించుకోలేక నియోజకవర్గానికి దూరమయ్యారు. రాజకీయంగా కూడా దూరమయ్యారు. అప్పుడప్పుడూ స్వగ్రామం కారంచేడుకు వస్తున్నారు. కుటుంబంతోనే ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లోనే వైద్యుడిగా, పుస్తకాలు రాసుకుంటూ, కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ రాజకీయ రహిత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఆయన అడుగులు మాత్రం భవిష్యత్ రాజకీయం వైపే పడుతున్నాయి. కారణం.. కుమారుడికి రాజకీయ మార్గాన్ని ఏర్పరచడమే ఆయన ప్రస్తుత లక్ష్యం.

టార్గెట్ 2024 ఎన్నికలు.. కానీ దారేది?

దగ్గుబాటి దంపతుల రాజకీయ వారసుడిగా వారి తనయుడు దగ్గుబాటి హితేశ్ ఉన్నారు. ప్రస్తుతానికి హితేశ్ వారి వ్యాపారాలు, ఆక్వా పరిశ్రమను చూసుకుంటున్నారు. అయితే.. 2024కి హితేశ్ ను ఎమ్మెల్యేగా చేయాలనేది వీరి లక్ష్యం. నిజానికి.. 2019లోనే ఎన్నికల్లోనే హితేశ్ ను రాజకీయాల్లోకి దింపాలనుకున్నా భారతీయ పౌరసత్వం లేక ఆగిపోయింది. ప్రస్తుతం అన్ని చిక్కులు తొలగిపోయాయి. బీజేపీలో పురంధేశ్వరి కీలకంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు తటస్థంగా ఉండిపోయారు. 2024కి హితేశ్ ను ఏదొక పార్టీలో ఎమ్మెల్యేను చేసేందుకు దారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో ఏ పార్టీ అనువైనదో అనే ఆలోచనలో ఉన్నారు. సొంతపార్టీ టీడీపీలో చంద్రబాబుతో విబేధాలు.. బీజేపీలో ఓట్లు రావడం కష్టం.. వైసీపీలో వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వారి వారసుడిని ఏపార్టీలోకి పంపించాలనేది వారికి సవాల్ గా మారింది.

 

author avatar
Muraliak

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?