NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయ్యో ఇలా జరిగిందేమిటి..! డాక్టర్ సుధాకర్ కేసులో కొత్త ట్విస్ట్..!!

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కల్గించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కీలకమైన కోణాలు దృష్టికి వచ్చాయి. డాక్టర్ సుధాకర్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంలో సుధాకర్ కేసులో  కుట్ర కోణం దాగి ఉందని, లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పేర్కొన్నది.

 

dr.sudhakar

దర్యాప్తునకు ఇంకా సమయం కావాలి

విశాఖ జిల్లా నర్శీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడుగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ మాస్క్‌లు, పిపిఈ కిట్‌లు సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ బహిరంగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆ తదుపరి విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ రోడ్డుపై వీరంగం వేయడం, పోలీసులు ఆయనను అమానవీయంగా అదుపులోకి తీసుకొని మెంటల్ ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత ఆయన తల్లి హైకోర్టును ఆశ్రయించి తన కుమారుడికి మానసిక రుగ్మత లేకపోయినా ఆసుపత్రిలో ఇబ్బంది పెడుతున్నారంటూ వేడుకోగా కోర్టు అనుమతితో ఆయనను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ కేసును హైకోర్టు..సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.

నవంబర్ 11న నివేదిక అందజేయాలి

ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉన్నందున లోతుగా దర్యప్తు చేయడానికి మరి కొంత సమయం కావాలని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు…ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలను మొత్తం నివేదించాలనీ, నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని సిబిఐకి ఆదేశిస్తూ విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఒ దళిత డాక్టర్ పై కక్షతో ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేయడం, ఇది రాష్ట వ్యాప్తంగా సంచలన అంశంగా మారిన సంగతి తెలిసిందే. సిబిఐ దర్యాప్తులో కుట్ర కోణాలు ఏమి వెలుగులోకి వస్తాయో? ఎవరు బాధ్యులు అవుతారో? చూడాలి మరి.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju