NewsOrbit
న్యూస్

ఆ విషయం లో జగన్ పై వైసిపిలో తీవ్ర అసంతృప్తి ! ఏమిటది ??

టీడీపీ నేతలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండటంపై పార్టీ వర్గాలు సణుగుతున్నాయి.

 Extreme dissatisfaction in the YCP over pics in that regard! What is it
Extreme dissatisfaction in the YCP over pics in that regard What is it

సత్తా ఉన్నా లేకున్నా టిడిపి అయితే చాలు వైసీపీలోకి వస్తామన్న ప్రతివారిని జగన్ పార్టీలోకి చేర్చేసుకుంటున్నారని వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టిడిపిని నిర్వీర్యం చేయడంతోపాటు వైసీపీని తిరుగులేని శక్తిగా రూపొందించటం జగన్ వ్యూహం కావచ్చు. కానీ కొత్తగా పార్టీ లోకి వస్తున్న టిడిపి వారి వల్ల కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్న విషయం జగన్ దృష్టికి వస్తున్నట్లు కనిపించడం లేదు..2014 ఎన్నికల్లో వైసీపీపై కేవలం 1 శాతం తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఆ తరువాత వైసీపీని పూర్తిగా తొక్కేయాలని.. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చంద్రబాబు చేర్చుకున్నారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది.వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నాడు నిండు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాకుండా వాక్ అవుట్ చేసి.. వాళ్లు ఉన్నంత వరకు అసెంబ్లీకి రాము అని స్పష్టం చేశాడు. ఆ సమయంలో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలోనూ దీన్ని హైలెట్ చేశారు.

జగన్ పాదయాత్రలో దీన్నే అస్త్రంగా మలిచారు. ప్రతీ సభలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా లాగేసి చంద్రబాబు మంత్రులను చేశాడని.. నేను అలా చేయను అని చెప్పి మరీ అధికారంలోకి వచ్చాడు జగన్.కానీ ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో జరిగినట్టే జరుగుతోందన్న ఆవేదన వైసీపీలో ఉంది.పైగా ఇంతకు ముందు జగన్ ఎవరైనా వేరే పార్టీ వాళ్లు వైసీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్న షరతు విధించారు.ఇప్పుడు ఆ షరతుకు కూడా జగన్ మినహాయింపు ఇచ్చి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు కండువా కప్పకుండా వాళ్ల కొడుకులకు.. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన వాళ్లకు నేరుగా కండువా కప్పుతున్నారు.

ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం వల్లభనేని వంశీ మద్దాలి గిరి లను ఇలాగే పరోక్ష పద్ధతిలో జగన్ వైసీపీలో చేర్చుకున్నారు.ఏపీలో ఎక్కడ చూసినా దీనిమీదే చర్చ జరుగుతోంది.టీడీపీకి వైసీపీకి ఏమీ తేడా  ఉందని జగన్ పార్టీ వారే గొణుక్కుంటున్నారు.ఇక టిడిపి తరపున ఎంపీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన సిద్దా రాఘవరావు , చలమలశెట్టి సునీల్ తదితరులకు కూడా జగన్ పార్టీలో ప్రవేశం కల్పించారు.పలువురు టిడిపి మాజీ ఎమ్మెల్యేలను కూడా చేర్చేసుకున్నారు. వీరి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేలు ఇన్చార్జి లకు వారు తలనొప్పి కలిగిస్తారు అన్న విషయాన్ని జగన్ గుర్తించడం లేదని పార్టీ వర్గాలు వాపోతున్నాయి

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri