NewsOrbit
రాజ‌కీయాలు

టీడీపీ..! ఇచ్చట తప్పులు చేయబడును..!!

tdp leaders have lost faith in chandrababu

చంద్రబాబు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? టీడీపీ ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తోంది? వీటికి జవాబులు చెప్పాలంటే చాంతాడంత జాబితా ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మంచి పనులతోపాటు మాటలు మార్చి తప్పు మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేక, పార్టీ శ్రేణులను చైతన్యపరచలేక పోతూ ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలుగా నాయకుల ఎంపిక, జిల్లాస్థాయిలో నాయకత్వాన్ని కాపాడుకోలేకపోవడం.. పార్టీ భవిష్యత్తును శాసిస్తున్నాయి.

tdp leaders have lost faith in chandrababu
tdp leaders have lost faith in chandrababu

చంద్రబాబువి ఊకదంపుడు ఉపన్యాసాలేనా..

చంద్రబాబును నమ్మలేం..! సుదీర్ఘ రాజకీయంలో ఆయనను చూసిన వారు చెప్పే మాట. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి రాగానే మరొకలా మాట్లాడటం బాబుకి ఇరవై ఏళ్లుగా అలవాటైన విషయమే. అధికారంలో ఉండగా పార్టీని పట్టించుకోవడం లేదని నాయకులు, కార్యకర్తలు లోలోపలే రగిలిపోయేవారు. మహానాడు, పార్టీ కార్యక్రమాల సమయంలో వారు తమ ఆవేదన చెప్పుకునేవారు. వారికి.. పార్టీ మీకు అండగా ఉంటుంది.. నేనున్నాను మీకు భయం లేదు.. అనటమే కాని.. పట్టించుకున్న దాఖలాలు వేవని పార్టీ నాయకులే అంటారు. చంద్రబాబు చెప్పే మాటలను అందరూ వినాల్సిందే. కానీ.. విని ఎంతమంది పాటిస్తున్నారనేదే ఇక్కడ విషయం. అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్నే ఆయన టెలీ కాన్ఫరెన్స్ వినని వాళ్లే ఎక్కువని.. ఆ ఉపన్యాసాలు వద్దని పార్టీలోని పెద్ద తలకాయలే బాహాటంగా చెప్పాయి. దీనిని అధికారంలో ఉండగా చంద్రబాబు మానలేదు.. అధికారం పోయాక మారనూ లేదు. ఆయన చెప్తారు.

చంద్రబాబు మాటలు వినని, నమ్మని వారే ఎక్కువా..

అధికారంలో ఉండగా  పార్టీని పట్టించుకోలేదు. ఇకపై మీకోసం పని చేస్తాను. మళ్లీ అధికారంలోకి వచ్చేలా మనం పని చేయాలి. అంటూ రొటీన్ డైలుగుల్నే అనంతపురం నాయకులతో పేల్చారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినవే ఇవి.. అధికారంలోకి రాగానే పట్టించుకోనివీ.. ఇవే. యువతకు ప్రాధాన్యం ఇస్తాం అనేది బాబు చెప్పే పరమ అబద్దమైన మాట అని.. వారితో పని చేయించుకుని తన పాత బ్యాచ్ లోనే వయసుమళ్లిన వారికి టికెట్లు, పదవులు ఇస్తారని ఓ వాదన. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని.. మధ్యలో వచ్చిన వారిని నెత్తికెక్కించుకుంటారని బాబుకు పేరు. ఇవన్నీ చూసిన టీడీపీ శ్రేణులు.. బాబుని నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. తెలంగాణలో పార్టీ ఉనికి పోవడానికి కారణం కూడా చంద్రబాబు మాటలపై నమ్మకం పోవడమే అని అంటారు. ఇవి చంద్రబాబు చేసే తప్పులు కావు.. ‘చంద్రబాబు రొటీన్ పొలిటికల్ స్ట్రాటజీ’ అనుకోవాలేమో.

 

 

 

 

 

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju