NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అప్పుడు అఖండ స్వాగతం..ఇప్పుడు అవమానం!

మూడున్నర సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి నగరం శంఖుస్థాపనకు వచ్చిపుడు ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవమానించాలో అంత అవమానించింది. ప్రధాని హోదాలో రెండవ సారి రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోదికి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠా, డిజిపి ఠాకూర్, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆయనకు స్వాగతం పలికారు.

ఇక రాజకీయపరంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నేతృత్వంలో కొందరు బిజెపి నాయకులు ప్రధానికి స్వాగతం పలికారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను విమానం దగ్గరకు అనుమతించలేదు. ఈ స్వాగతంతో సరిపెట్టుకుని ప్రధాని హెలీకాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. అక్కడ ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం మూడు అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో ఉవెత్తున లేస్తున్న నిరసనలను దృష్టిలో ఉంచుకుని కాబోలు ఆ కార్యక్రమాలను కూడా ఆయన గుంటూరు నుంచే రిమోట్ ద్వారా నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక హోదా లేదంటూ నవ్యాంధ్రకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటింన తర్వాత దాని కింద వచ్చే నిధులు, సహాయం కోసం కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీకి నిరసన సెగ అంటాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే ప్రొటోకాల్‌ను పక్కన పెట్టాలని నిర్ణయించారు.

ఆ ప్రకారమే విమానాశ్రయంలో స్థానిక మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు  లేరు. స్థానిక శాసనసభ్యుడు లేడు. ప్రధాని అంతటి వాడు వస్తే అక్కడ స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులన్న వారు ఒక్కడూ లేడు. గుంటూరులో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన స్థానిక ఎంపి గల్లా జయదేవ్ కూడా గైరుహాజరవు తున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment