NewsOrbit
న్యూస్

ఇన్నాళ్లకు జగన్ కరెక్టు మేటర్ మీద ఫోకస్ పెడుతున్నాడు! సూపర్ హిట్ గ్యారెంటీ!!

తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టలేని పరిస్థితులు తీసుకురావటానికి వైసిపి కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను వైసిపి లాగేయడం తెలిసిందే.

మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను టిడిపి నుండి తెచ్చుకొని చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష నాయకుని హోదాను కూడా తీసేయడానికి వైసిపి రంగం సిద్ధం చేసింది. ఇది టిడిపి కూడా ఊహించిన పరిణామమే. అయితే తెలుగుదేశం పార్టీ అస్సలు ఊహించని మరో కోణంలో వైసిపి రాజకీయం సాగుతోంది.వైసీపీ కీలక నేతలు ఇప్పుడు టిడిపి ఆర్ధిక మూలాల మీద దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.అవసర సమయంలో తెలుగుదేశం పార్టీకి ఖర్చుపెట్టే నాయకుల మీద ఇప్పుడు జగను సర్కార్ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది  ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యంచేసేవిధంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టుబడి పెట్టే వారిని వైసీపీలోకి ఆహ్వానించే విధంగా విజయసాయిరెడ్డి గత వారం రోజుల నుంచి కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు.

తెలుగుదేశంలో ఎవరైతే ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారో వారందరినీ కూడా వైసీపీలోకి ఆహ్వానించి వారికి మంచి పదవులు ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు.సీఎం జగన్ కూడా విజయసాయిరెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఇప్పటికే పూర్తిగా నాశనం చేయడానికి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురిని వైసీపీలోకి లాక్కునే విధంగా పావులు కదిపారు. ఇప్పటికే వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే గంటా శ్రీనివాసరావు కూడా జై కొట్టే అవకాశం ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి. గణేష్ నిష్క్రమణ టిడిపికి చాలా నష్టదాయకం అంటున్నారు.

ఎమ్మెల్యేనే కాకుండా విశాఖ నగర టీడీపీ అధ్యక్ష పదవిలో కూడా ఉన్న గణేష్ ఆ మహానగరంలో టిడిపిని కోలుకోలేని దెబ్బ తీస్తారని అంచనా. అలాగే ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఫైనాన్షియరు గా ఉన్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుని వైసిపి ఇప్పటికే లాగేసింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో టిడిపి కి ఆర్థిక అండదండలు అందించే నాయకులందరినీ వైసిపి ఆకర్షించే పనిలో ఉంది. ఇది వర్కౌట్ అయితే టీడీపీకి పైసా కూడా పుట్టని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి దుస్థితి ఎదురయితే టీడీపీకి ఇక అంతా గడ్డుకాలమే!

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju