తక్కువ ధరకే, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడంలో రియల్‌మి పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన ఫోన్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇక తాజాగా మరో 3 కొత్త ఫోన్లను కూడా రియల్ మి విడుదల చేసింది. రియల్‌మి నార్జొ 20, నార్జొ 20 ప్రొ, నార్జొ 20ఎ పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, వీటి ధరలు ఎంత ? అన్న వివరాలపై ఓ లుక్కేద్దాం..!
రియల్‌మి నార్జొ 20 ఫోన్లో.. 6.5 ఇంచుల డిస్ప్లే ఉండగా దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్‌తో 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉంది. వెనుక వైపు 48, 8, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
రియల్‌మి నార్జొ 20 ప్రొ ఫోన్లో… 6.5 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6,8 జీబీ ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. మెమొరీని 256 జీబీ వరకు కార్డు ద్వారా పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 48, 8, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కన ఉంటుంది. యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు.
రియల్‌మి నార్జొ 20ఎ ఫోన్లో.. 6.5 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను అమర్చారు. 3,4జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇచ్చారు. 12, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.
* రియల్‌మి నార్జొ 20 ఫోన్ కు చెందిన 64జీబీ మోడల్ ధర రూ.10,499. 128జీబీ మోడల్ ధర రూ.11,499. సెప్టెంబర్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
* రియల్‌మి నార్జొ 20 ప్రొ ఫోన్ కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ మోడల్ ధర రూ.14,999. 8జీబీ ర్యామ్, 128 జీబీ మోడల్ ధర రూ.16,999. ఈ నెల 25 నుంచి కొనవచ్చు.
* రియల్‌మి నార్జొ 20ఎ ఫోన్ 3జీబీ ర్యామ్, 32జీబీ మోడల్ ధర రూ.8,499. 4జీబీ ర్యామ్, 64జీబీ మోడల్ ధర రూ.9,499. ఈ నెల 30 నుంచి కొనుగోలు చేయవచ్చు.