NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – వైసిపి భూముల లెక్కలు తేల్చాల్సిందే..!!

ysrcp and tdp alleging both on insider trading

రాజధానిగా చూపిస్తూ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద భూకుంభకోణం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటివరకూ అమరావతి వరకే పరిమితమైన ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు విశాఖ వరకూ పాకింది. అక్కడ వైసీపీ ఇందుకు తెరతీసిందని టీడీపీ ఆరోపిస్తోంది. మరి.. వైసీపీ చెప్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ గెలుస్తుందా.. టీడీపీ లేవనెత్తుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ గెలుస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అమరావతిలో జరిగిందేమిటో.. విశాఖలో జరుగుతున్నదేంటే తేలాల్సిన తరుణం వచ్చినట్టే తెలుస్తోంది.

ysrcp and tdp alleging both on insider trading
ysrcp and tdp alleging both on insider trading

వేలాది ఎకరాలు రాజకీయ నాయకుల చేతుల్లోకేనా..?

రాజధానిగా ఓ ప్రాంతం నిర్ణయం కాకముందే.. ఆ ప్రాంతంలో రాజధాని రాబోతుందని తెలుసుకుని ముందుగా భూములు కొనడమే ఇన్ సైడర్ ట్రేడింగ్. గత టీడీపీ ప్రభుత్వం చేసింది ఇదేనంటూ ఆరోపిస్తూ.. ఈ ఆరోపణలకు కట్టుబడి ఉంది వైసీపీ. 4068 ఎకరాల్లో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని.. దానిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ పట్టుబడుతోంది. దీనిలో టీడీపీ మాజీ మంత్రులు, నాయకులు, కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. ఇదిలావుంటే.. విశాఖలో రాజధాని పేరుతో అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ అనుకూల మీడియా మూడు రోజుల నుంచి కోడై కూస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే విశాఖలో దాదాపు 70వేల రిజిస్ట్రేషన్లు, 22వేల ఎకరాల భూముల లావాదేవీలు జరిగాయని.. ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది.

నిగ్గు తేలి నిజాలు బయటకొస్తే షాకయ్యేది ఎవరు?

మొత్తం మీద అమరావతి, విశాఖలో భూ కుంభకోణాలు జరిగిందనేది వాస్తవం. ఎవరు తిన్నారు, ఎవరు అవినీతి  చేశారు.. ఏ ప్రభుత్వం ఎక్కువ చేసిందనేది తేల్చాలంటే.. రెండు పిల్లుల మధ్య కోతి కథలా మారే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీ భూభాగోతలు బీజేపీ చేతిలో రాయిలా మారేలా ఉంది. అమరావతిపై సీబీఐ విచారణ చేస్తే.. విశాఖపై కూడా సీబీఐ విచారణ చేయాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇదే జరిగితే.. కేంద్రంలో ఉన్న బీజేపీకి వైసీపీ, టీడీపీని శాసించే అవకాశం చిక్కినట్టే. రెండు ప్రభుత్వాలు, రాజధానుల్లో జరిగిన అవినీతి ఆరోపణల్లోని నిజాలను న్యూట్రల్ వర్గాలు నిగ్గు తేలిస్తే వచ్చే ఎన్నికలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందనే చెప్పాలి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju