NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని…క‌న్నీళ్లు పెట్టుకొన్న‌ది ఎందుకంటే?

Gudivada Politics: TDP Target Kodali Nani - Special Strategy Exclusive

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ తిరుమ‌ల తిరుప‌తి దేవాల‌యంలో డిక్ల‌రేషన్‌ ఇవ్వ‌డం, మ‌రోవైపు దేవాలయాలపై దాడుల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. kodali nani over praising cm jagan

ఇదే స‌మ‌యంలో వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఏకంగా డిక్లరేషన్ తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగ‌డంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఏకంగా ఓ టీవీ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సీఎం జగన్‌ను కాపాడ‌బోయి…

తిరుమ‌ల తిరుప‌తి దేవాల‌యంలో డిక్ల‌రేష‌న్ గురించి స్పందించ‌డంతో పాటుగా దేవాల‌యాల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలే పోటీ పడి దాడులు చేయిస్తున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే, ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.దేవుడిపై మంత్రి కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి పార్టీ నేత‌ల‌తో వినతిపత్రం ఇప్పించారు. వెంకన్న ఏమైనా నానికి బావమరిదా… డిక్లరేషన్ ఎవరు పెట్టారు అంటారా ? ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఆయనకు నష్టమా, రధం దగ్ధం అయితే… కోటి రూపాయలతో‌ చేపిస్తున్నారు అంటూ దేవుడిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు.

ఇప్పుడు క‌న్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం?

వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని అప్పుడు వైఎస్సార్‌కు, ఇప్పుడు జగన్‌కు ఆ ఏడుకొండల వాడే కల్పించాడని మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమ‌ల డిక్లరేషన్ తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొడాలి నాని అన్నారు. డిక్లరేషన్ ఎవరు పెట్టారు.. ఎప్పుడు పెట్టారనే అంశంపై చర్చ జరగాలన్నారు.

ఈ స్వామి కూడా ఫైర‌య్యాడే…..

కాకినాడ శ్రీ పీఠానికి చెందిన స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని హిందువు అయినప్పటికీ,ఆయన తల్లి తండ్రులు హిందువులు అయినప్పటికీ తిరుమల ఆలయంలో వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఫారమ్‌లో నాని సంతకం చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నానికి తన మతంపై నమ్మకం లేదని, ఎందుకంటే హిందూ దేవతల విగ్రహాలను ప్రాణంలేని వస్తువులతో పోల్చారని అన్నారు. తిరుమల స్వామివారితో పెట్టుకోవద్దని కొడాలి నానిని హెచ్చరించారు. ఒక స్వామిగా కొడాలి నాని హిందువు కాలేడని చెబుతున్నానని అన్నారు. నాని లా మేము దిగజారి మాట్లాడలేమని పరిపూర్ణానంద అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పినట్టు హిందువుల మనోభావాలను గౌరవించాలని అన్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N