NewsOrbit
రాజ‌కీయాలు

ఉన్నట్టుండి బీజేపీకి రేవంత్ రెడ్డి అవసరం ఎందుకొచ్చినట్టో..?

telangana bjp eyeing on revanth reddy

తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ చూపించగలరు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే ఆయన పార్టీకి ఎస్సెట్ గా ఉంటారు. ఈ స్థాయి పవర్ ఉన్న రేవంత్ పై ఇప్పడు బీజేపీ కన్ను పడింది. పార్టీలోకి రేవంత్ ను తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలంటే ఇప్పుడు మొదలుపెడితే ఎప్పుడో కాకుండా.. ఒక వారం లోపే రేవంత్ ను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నపళంగా రేవంత్ ను బీజేపీలోకి తీసుకొచ్చే పని ఎందుకు పెట్టుకున్నట్టు.. అంటే..

telangana bjp eyeing on revanth reddy
telangana bjp eyeing on revanth reddy

గ్రేటర్ ఎన్నికలు నవంబర్ లోనే..

హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ ఎన్నికలు నవంబర్ లో జరుగబోతున్నాయి. ఇంకా రెండు నెలలు కూడా సమయం లేని.. ఈ సమయంలోనే రేవంత్ ను తీసుకొచ్చి పార్టీని బలపర్చాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఆలోచన. బీజేపీకి హైదరాబాద్ లో పట్టు ఉంది. బీజేపీ సొంతంగా ఎన్నికలకు వెళ్తే 15 నుంచి 20 స్థానాలు గెలుచుకోగల సత్తా ఉంది. మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 80 కార్పొరేటర్ స్థానాలు చేజిక్కించుకోవాలి. ఇందుకోసం టీడీపీ, కాంగ్రెస్ లోని బలమైన నాయకులను పార్టీలోకి తెచ్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. రేవంత్ స్వయంగా 10-15 కార్పొరేటర్ స్థానాలు గెలిపించే సత్తా ఉండడం.. టీడీపీని కలుపుకుంటే మరికొన్ని సీట్లు సాధించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలనేది బీజేపీ ఆలోచన.

టార్గెట్ 2024కు కూడా రేవంతే ఆయుధం..

నగరపాలక సంస్థ ఎన్నికల తర్వాత కూడా రేవంత్ అవసరం బీజేపీకి ఉంది. 2024లో తెలంగాణలో అధకారం పొందాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి ప్రముఖులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో పాటు ముఖ్యంగా రేవంత్ ను తీసుకొస్తే రాష్ట్రంలో కనీసం ఉమ్మడి ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఓటింగ్ ను శాసించగలరని బీజేపీ భావిస్తోంది. ఇందుకు రేవంత్ తో సంప్రదింపులు ప్రారంభించిందని సమాచారం. దీనిపై వారం పది రోజుల్లో స్పష్టత రానుంది. రేవంత్ బీజేపీలోకి వస్తే కేంద్రం సహకారంతో కేసీఆర్, కేటీఆర్ కు చెమటలు పట్టించడం ఖాయమే.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?