NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గంటా వైసీపీ లోకి వస్తే పదవిని వదులుకుంటానంటున్న మంత్రి! మేటర్ చాలా దూరం వెళ్ళిందే!!

విశాఖపట్నం జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజకీయంగా తనబద్ధ విరోధి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వైసీపీలో చేర్చుకున్న

The minister who is going to resign if he comes into the YCP hourly! Matter goes too far
The minister who is going to resign if he comes into the YCP hourly! Matter goes too far

పక్షంలో వెను వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి శాసనసభ్యుడిగా మాత్రమే కొనసాగాలని ఆయన డిసైడ్ అయ్యారట.ఇప్పటికే ఈ విషయాన్ని అవంతి శ్రీనివాస్ పార్టీ అధిష్ఠానవర్గానికి చేర వేశారట.దీంతో వైసీపీలో మంత్రి శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.ఇప్పటి వరకు అవంతి మాదిరిగా వైసిపిలో చేరికలకు రియాక్టయిన వారు మరొకరు లేరు.విషయానికొస్తే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులు హోదాను తీసేయడానికి స్వయంగా సిఎం జగన్ పావులు కదిపారు.ఇప్పటికే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను లాగేసారు.అయితే టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీలో చేరిన నియోజకవర్గాల్లో రచ్చ రచ్చ జరుగుతోంది జరుగుతోంది .

గన్నవరం లో రాజకీయ రచ్చ తీవ్రమైంది.వంశీ,దుట్టా,యార్లగడ్డ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఇక చీరాల లో వీధి పంచాయతీ తీవ్రమైంది.ఎంత నీచుడు కాకపోతే జగన్ సునామీ లో కూడా ఆమంచి ఓడిపోతాడు అంటూ కరణం సెటైర్లు వేస్తుంటే కరణం ఫ్యామిలీ పై ఆమంచి అధిష్టానానికి లేఖ రాసారు.ఇక గుంటూరు వెస్ట్ లో వింత పరిస్థితి మద్దాల గిరికి మద్దెల దరువు అంటున్నారు వైకాపా నేతలు.చంద్రగిరి ఏసు రత్నమే ఇక్కడ ఎమ్మెల్యేగా చలామణి అవుతుంటే మద్దాల గిరి చెల్లని కాసులా మారారు.విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైఎసార్సీపి లో చేరిన రెండో రోజే రచ్చ మొదలయ్యింది.రెహమాన్,కోలా గురువులు,రమణ మూర్తి వాసుపల్లి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలెట్టారు.

ఇప్పుడు ఐదో కృష్ణుడు తయారయ్యాడు.గంట శ్రీనివాస్ పార్టీలకు అతీతం,అధికారం ఎక్కడుంటే ఆయన అటుంటారు.ఆయన ఇప్పుడు వైఎసార్సీపి పై మనసుపడ్డారు.కానీ ఆయన రాకను అవంతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.లాబీయింగ్ లో గంటా ని మించిన రాజకీయ నాయకుడు ఉండదు అనడం అతిశయోక్తి కాదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటా అవినీతి పరుడు,గంటా ని జైలుకి పంపడం ఖాయం అన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు.గంటా లాబీయింగ్ దెబ్బకి విజయసాయి రెడ్డి మెడ వంచక తప్పలేదు.కానీ గంటా కి బద్ద శత్రువుగా మారిన అవంతి శ్రీనివాస్ మాత్రం గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గంటాని అడ్డుకోవడానికి అవంతి చెయ్యని ప్రయత్నం లేదు.

అయినా గంటా పావులు కదుపుతూనే ఉన్నారు.దీంతో అవంతి పాశుపతాస్త్రాన్ని తెరపైకి తెచ్చారు.గంటా పార్టీలో చేరితే మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని డిసైడ్ అయ్యారట.వైసీపీలో గంటాచేరిక దాదాపు ఖాయమైన తరుణంలో అవంతి శ్రీనివాస్ గత రెండు రోజులుగా తన సన్నిహితులతో చర్చలు జరిపి ఆపై ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మరి జగన్ తన మంత్రి అవంతి శ్రీనివాస్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి .

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N