NewsOrbit
Featured రాజ‌కీయాలు

వంశీ షాకింగ్ నిర్ణయం..! గన్నవరంలో ఏం జరుగుతోంది..!!

AP Political News: Interesting Gossip Internal Facts

గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఒకే పార్టీలో మూడు వర్గాలు, మూడు భిన్న కార్యాచరణలతో కొట్టుకుంటూ కేసులు వరకూ వెళ్తున్నారు. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి రాజకీయంగా ఎప్పుడూ లేని కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాలు గొడవలు ఎందుకని ఓ సంచలన నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గం అంటోంది.

vallabhaneni vamsi shocking decision in politics
vallabhaneni vamsi shocking decision in politics

రోజూ ఎక్కడో ఒక చోట తన్నులాటలే..

ఎమ్మెల్యే వంశీ వైసీపీలో అనధికారికంగా చేరి ఆరు నెలలు అవుతోంది. ఆయన మంత్రి కొడాలి నాని సపోర్ట్ తో జగన్ ను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మెప్పు పొందేందుకు ఆయన చేసిన ప్రయత్నాలే ఇవన్నీ. అయితే.. జగన్ కు ఆయన చేసిన అతి భజన ఇప్పుడు బెడిసి కొట్టినట్టే ఉంది. గన్నవరంలో ఒంటిచేత్తో పెత్తనం నడిపించాలని అనుకున్న వంశీకి జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు. పార్టీకి ముందునుంచీ నమ్ముకుని ఉన్న గుత్తా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పని చేయాలని ముందే స్పష్టం చేశారు. అయితే అక్కడ ఇలా జరగడం లేదు. మూడు వర్గాలు రోజూ కొట్టుకుంటూ ఎవరి దారిన వారు వెళ్తున్నారు.

రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం..

గడచిన మూడు నెలల నుంచి గన్నవరంలో వంశీ వర్సెస్ గుత్తా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గం.. కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తున్నారు. వంశీపై వీరిద్దరూ మీడియా ముఖంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో వంశీ అక్కడ ఇమడలేక రాజకీయాల నుంచి తప్పుకునే యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నారు. నిజానికి గతంలో కూడా వంశీపై ఇవే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ వివాదాలను చూపించి రాజకీయాల నుంచి వంశీ తప్పుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. నిజానికి యాక్టివ్ పాలిటిక్స్ లో కీలకంగా ఉన్న వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవడం అసాధ్యం. కేవలం రాజకీయ సానుభూతి కోసమే వంశీ వర్గం ఈ ప్రచారానికి తెర లేపిందని అంటున్నారు.

 

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?