NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

హైదరాబాద్ వర్షాలు : 150 ఏళ్ల రికార్డు ఇక లేనట్టే…

సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం బాగా తక్కువ. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. అయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో హైదరాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ మహానగరంలో ప్రతియేటా భారీ వర్షాలు పడుతుంటాయి. ఇక సగటు వర్షపాతం కన్నా తెలంగాణలోని రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా ఎక్కువ నమోదు అవుతుంది. ఈ సారి పడుతున్న భారీ వర్షాల కారణంగా నూట యాభై ఏళ్ల రికార్డును 2020 తుడిచిపెట్టడానికి రెడీగా ఉంది.

 

ఒక్కో వీధి ఒక్కో హుస్సేన్ సాగర్..!

నిన్న కుంభవృష్టిగా హైదరాబాద్ లో కురిసిన వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ మూసి నది ని తలపించాయి. కొన్నిచోట్ల అయితే మధ్యలో బుద్ధుడి విగ్రహం ఒకటి తక్కువ లేకపోతే హైదరాబాద్ లో ఎన్నో హుస్సేన్సాగర్ లు వెలిసేవి అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు. మొదటిరోజు వర్షాలు బాగానే ఆస్వాదించిన వారు రెండు మూడు రోజుల తర్వాత విసుగెత్తిపోయేంత పరిస్థితిలో కుండపోత కురుస్తోంది. తాజాగా గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన వరుణుడు సోమవారం సాయంత్రం మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆపకుండా తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. 24 గంటలకు పైగా విరామం లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనాలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు.

2020 ఖాతాలొ మరో రికార్డు?

ఇక నిన్న అత్యధికంగా హైదరాబాద్ మహానగరంలో 32 సెంటీమీటర్ల మేర కు వర్షం పడిందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షం గత కొన్ని నెలల్లో అత్యధికం కావడం విశేషం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇంత భారీ వర్షం పడితే అక్కడే ఉన్నా డ్రైనేజీ సిస్టం దురావస్థ కారణంగా ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడటమే కాకుండా ఈ కరోనా కష్టకాలంలో లేనిపోని రోగాలను కొనితెచ్చిపెట్టుకుంటారు. అయితే హైదరాబాద్ నగరంలో గత 150 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైన సంవత్సరంగా 2020 రికార్డుని సృష్టించడానికి అత్యంత చేరువలో ఉన్నట్లుగా ఒక వాతావరణ నిపుణుడు ఓ ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ సంవత్సరం పడినంత వర్షం ఈ నగరంలో గత 150 ఏళ్లలో పడకపోవడం విశేషం.

ఎంతో ప్రమాదం..!

ఇక ప్రస్తుత విషయానికి వస్తే నగరం పరిస్థితి ఘోరంగా తయారైంది. చాలా ఏరియాలలో నదులు చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద సెంటర్లు జలమయం అయ్యాయి. ఇళ్ళు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో బయట తిరగడం అత్యంత ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరోజు పైగా ఆగకుండా వర్షంపడడం వల్ల రోడ్లు నానడం వల్ల నాణ్యతలో మాత్రం తేడా ఉన్నప్పటికీ అవి ఉన్నపాటుగా కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?