బిగ్ బాస్ రియాలిటీ షో కి వరుసగా రెండవ సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున హాట్ డాగ్ షూటింగ్ నిమిత్తం ఒక రెండు వారాలు అందుబాటులో ఉండదు అన్న విషయం తెలిసిందే. అతని స్థానంలో కోడలు పిల్ల సమంత అదరగోట్టేసింది అనే చెప్పాలి. అందరితో కలిసిపోయి అలరించిన సమంత పండుగ రోజు ఎపిసోడ్ లో అయితే నిర్విరామంగా మూడు గంటల ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొని ప్రత్యేక డ్యాన్సులు, సెలబ్రిటీలు, నవ్వులు అన్నింటిని చాలా తేలికగా హ్యాండిల్ చేసింది అనే చెప్పాలి.
నిజానికి మొదట నిర్వాహకులు సమంత సంప్రదించినప్పుడు ఆమె కొద్దిగా సమయం కావాలని అడిగారట. నాగార్జున కోడలి కాబట్టి రెమ్యునరేషన్ కూడా కలిసి వస్తుంది అని వారు సంప్రదించినట్లు సమాచారం. నాగార్జున పెట్టిన ఫ్లో ను కంటిన్యూ చేయాలంటే సమంత లాంటి నటికి సైతం కత్తిమీద సాములాంటిదే. అయితే చివరికి సమంత ఒప్పుకోవడంతో నిర్వాహకులు కానీ ఆమె ఎలా మేనేజ్ చేస్తుంది అని టెన్షన్ పడ్డారు.
కానీ సమంత బాగానే తన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక నాగార్జున కి మాట్లాడుకున్న రెమ్యునరేషన్ లో ఆమెకి ఎంత ఇవ్వబోతున్నారు అన్న విషయంపై సర్వత్రా చర్చ జరిగింది. బయటకు వచ్చిన సమాచారం ఏమిటంటే సమంతకు ఈ రెండు ఎపిసోడ్ లకు గాను 15 నుండి 20 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కావ్వచ్చు… హోస్ట్ కావచ్చు వారి రెమ్యునరేషన్ విషయంలో గోప్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అధికారికంగా బయటికి ఏది వెలువడలేదు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!