NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ : ప్లే ఆఫ్ రేస్ కిక్కే వేరప్పా 3, 4 తేలేది నేడే

(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో)

ఈసారి ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ బెర్తుల ఖరారు కాక పుట్టిస్తోంది. కప్పు కొట్టినంత ఉత్కంఠ కలిగిస్తోంది. చివరి వరకు ప్లే ఆఫ్ లో నిలిచే నాలుగు జట్లలో 3 ఏమిటి అనేది అర్ధం కావడం లేదు. ఇది సగటు క్రికెట్ ప్రేమికుడికి ఏం జరుగుతుందో తమ ఫేవరేట్ జట్టు ప్లేఆఫ్ లో నిలుస్తుందో లేదో అన్న అయోమయాన్ని కలిగిస్తోంది.

ఢిల్లీ కి ఏమైంది??

ఢిల్లీ కేపీటల్స్ జట్టు జోరు ను చూసిన ఎవరైనా అది చాలా సులభంగా ప్లేఆఫ్ లోకి వెళ్తుంది అని భావించారు. వరుసగా విజయాలు దక్కించుకుని 7 విజయాలతో 14 పాయింట్ల తో దూసుకెళ్లింది. పాయింట్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఐదు మ్యాచ్ లలో అత్యంత నాసి రకపు ఆట ప్రదర్శన చేస్తూ నిరాశ పరిచింది. చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ చేరని స్థితి కి వచ్చేసింది. దీనికి ఆ జట్టు సమతుకం ఒక కారణం అయితే యువకులతో నిండిన ఆ జట్టులో ఎవరు పూర్తి ఫామ్ లో లేకపోవడం మరో కారణం. రిషిబ్ పంత్, పృద్వి షా లు వరుసగా నిరాశ పరుస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఒకటి అర ప్రదర్శన తిప్పితే నిలకడగా ఫామ్ లో లేకపోవడం, ధావన్ మీద సీనియర్ గా బాధ్యతలు పెట్టడం జట్టు వెనుకబాటుకు కారణం. టాప్ ఆర్డర్ కుప్పకులగానే వరుసగా పెవిలియన్ కు అంత దారి కడుతున్నారు. బాటింగ్ లో మెరుగు కాకపోతే ఢిల్లీ మరోసారి ప్లే ఆఫ్ చేరకుండా ఇంటికి వెళ్తుంది. సోమవారం బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో నెగ్గితేనే పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి వెళ్తుంది. అలాగే బెంగళూరు గెలిస్తే అది 16 పాయింట్స్ తో రెండో స్థానం చేరుకుంటుంది. సోమవారం మ్యాచ్ ప్లే ఆఫ్ రెండో స్థానంలో ఎవరు ఉంటారో నిర్ణయిస్తే మరి 3, 4 స్థానాల కోసం మరో ఆసక్తికరమైన ఘట్టం సాగుతోంది

3, 4 ఎవరు?

ప్లే ఆఫ్ లో 3, 4 స్థానాల పై సందిగ్ధం కొనసాగుతోంది. ఒకరి అపజయం పై మరొకరి భవిత ఒకరి రన్ రేట్ మీద మరొకరి చూపు ఉన్నాయి. ఇప్పటికే ఇంటి దారి పట్టిన చెన్నై జట్టుతో పంజాబ్ ఆదివారం అమీ తుమి తేల్చుకోవాలి. వరుస విజయాలు మీద ఉన్న పంజాబ్ చివరి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం తో ప్లేఆఫ్ సంక్లిష్టం అయ్యింది. చెన్నై మీద మంచి రన్ రేట్ తో గెలిస్తే పంజాబ్ కు అవకాశాలు ఉంటాయి. ఇక రన్ రేట్ లో అద్భుతమైన ముందంజలో ఉన్న హైదరాబాద్ తర్వాత మ్యాచ్ ను మంగళవారం ముంబై తో తలపడనుంది. దీనిలో గెలిస్తే మరో జట్ల విజయాల మీద ఆధారపడకుండా నే నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. ఆదివారం జరిగే రాజస్థాన్, కోల్ కతా మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళ్తే గెలిచే జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా ఇతర జట్ల విజయాల మీద, రన్ రేట్ మీద ఆధారపడాలి. మొత్తం మీద ఐపీఎల్ కప్పు మాటేమో గాని ఈ సారి ప్లే ఆఫ్ ఫైట్ యుద్దాన్ని తలపిస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju