NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ రేవంత్ రెడ్డి … కాంగ్రెస్ నేత‌ల కొత్త ప్లాన్‌

revanth reddy plans to form a new political party

కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే పేరుంది. గ్రూపు రాజకీయాల‌ను దూరం చేయాల‌ని పార్టీ సీనియ‌ర్లు ఎంత సూచించినా అవి అలాగే కొన‌సాగుతున్నాయి. revanth reddy plans to form a new political party

తాజాగా అలాంటి గ్రూపు రాజ‌కీయ‌మే బయ‌ట‌ప‌డింది. అయితే , ఇందులో టార్గెట్ అయింది కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి.

 

విష‌యం ఏంటంటే…

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో రైతు పోలీకేక సభ పేరుతో ర్యాలీ చేప‌ట్టారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నేత‌లు ప‌లువురు పాల్గొన్నారు. దేశం, రాష్ర్టంలో రైతు వెన్నుముక విరిచేందుకే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ వీహెచ్ మ‌ధ్య ఒకింత మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది.

రేవంత్ ఏమ‌న్నారంటే…

ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిర్చి రైతుల గిట్టుబాటు కోసం రైతులు పోరాడితే అరెస్ట్ చేసి రైతుల చేతులకు బేడీలు వేసి బందీపోటు దొంగలా చేసిన ఘనుడు కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు. గిట్టుబాటు ధర రాకపోతే రైతులే మంట పెట్టి తగలబెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. రైతు పండించిన పంటకు దళారులు ధర నిర్ణయస్తున్నారని.. కాంగ్రెస్ గిట్టుబాటు ధర చట్టం చేసిందని గుర్తుచేశారు. కల్లాల వరకే వచ్చి కార్పోరేట్ వాళ్లు కోనుగోలు చేసే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు తీర్మాణం చేయలేదని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని… ఎవరు ఆత్మహాత్యలు చేసుకోవద్దని కోరారు. అమ్ముడు పోయేటోళ్లను ఏరివేయాలని… డిపాజిట్లు పోయిన నాయకుల పెత్తనం కాంగ్రెస్ లో ఉండదని కేంద్ర పార్టీ చెప్పిందన్నారు. ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని…కేటిఆర్, కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు నాయకులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వీహెచ్ వెంట‌నే…

అయితే ఇదే స‌భ‌లో పీసీసీ మాజీ ఛీఫ్ వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని బడుగు బలహీన వర్గాల వారికీ ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లగలుగుతుందని అన్నారు. వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ కు అనుకూలంగా సభలో నినాదాలు చేస్తున్నా, వీహెచ్ వెనక్కి తగ్గలేదు. బడుగు బలహీన వర్గాలవారికి అధ్యక్ష పదవిని ఇస్తేనే రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వీహెచ్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఐక్య‌త‌ను చాటే స‌భ‌లో ఆ పార్టీ అనైక్య‌త స్ప‌ష్ట‌మైంద‌ని ప‌లువురు అంటుంటే… అదే స‌భ‌లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశార‌ని ఇంకొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N