NewsOrbit
న్యూస్ సినిమా

మెగా ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్.. రాం చరణ్ – పూరి కాంబోలో సినిమా ఫిక్స్..?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని సిల్వర్ స్క్రీన్ కి హీరోగా పరిచయం చేసింది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. పక్కా కమర్షియల్ హీరోగా లాంచ్ అయిన చరణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. మెగాస్టార్.. పూరి మీద నమ్మకం పెట్టుకొని చరణ్ ని హీరోగా నిలబెట్టే బాధ్యతని అప్పగించినందుకు మంచి హిట్ ఇచ్చి మెగాస్టార్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పూరి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో సార్లు పూరి జగన్నాధ్ – రాం చరణ్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికి ఎందుకనో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

Ram Charan, Alia Bhatt, Ajay Devgn starrer RRR to be postponed to the summer of 2021? | Celebrities News – India TV

ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా భారీ హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండస్ట్రీ హిట్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది. కాగా ప్రస్తుతం రాం చరణ్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు.

కాగా ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకున్నాడు. కాని చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడో క్లారిటీ లేదు. అయితే కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య లో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం చరణ్ తన నెక్స్ట్ సినిమాని పూరి జగన్నాధ్ తో చేస్తాడన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నధ్.. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీటయ్యాక చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండబోతోందని సమాచారం. చూడాలి మరి ఈ సినిమా కి సంబధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri