బాబు బ‌లంపై కొడుతున్న జ‌గ‌న్ … అందుకే మండిపోయి ఏం చేస్తున్నారంటే….

Share

ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్‌గా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప‌లు విమ‌ర్శ‌లు చేసే , చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా జ‌గ‌న్‌ తీసుకున్న ఓ నిర్ణ‌యంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు బ‌లం మీడియాలో హైలెట్ అవ‌డం అనే సంగతి తెలిసిందే. అలా హైలెట్ అయేందుకు జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాన్ని చంద్ర‌బాబు తప్పుప‌ట్టారు.

జ‌గ‌న్ చేసిన ప‌నికి మండిపోయిన బాబు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో టిడిపి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆదాయానికి ఇంత ఇబ్బందులు పడుతూ, రూ లక్షా 20వేల కోట్ల అప్పులు తెస్తూ, ఫేక్ స్కీమ్స్ కు ఫుల్ పేజి యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా..? అని ఆరోపించారు. “ప్రజాధనంతో సీఎం సొంత మీడియాకు ప్రకటనల కోసమే ఫేక్ స్కీమ్స్, వాటికి నిధుల విడుదలపై యాడ్స్ ముసుగులో ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. సాధారణంగా విడుదల చేసే నిధులకు కూడా యాడ్స్ ఇవ్వడం సొంత జేబులు నింపుకోడానికే“ అంటూ విరుచుకుప‌డ్డారు.

ఇంకో నాయ‌కుడు సైతం..

రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని టీడీపీ నేత శ్రీ‌నివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. “14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్లు విడుదల చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సాక్షికి పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చేసింది తక్కువ ప్రకటనలకు ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంది.“ అంటూ మండిప‌డ్డారు.


Share

Related posts

Nagarjuna : అమ్మో నాగార్జున మామూలోడు కాదు – చిరు, బాలయ్యల కే చెమటలు పట్టిస్తున్నాడు

arun kanna

Ganta Srinivas Rao : బాబుకు అదిరిపోయే షాకిచ్చిన గంటా శ్రీ‌నివాస‌రావు .. జ‌గ‌న్ కు తీపిక‌బురే!

sridhar

Job update: డబ్యూడీసీడబ్యూ నోటిఫికేషన్..!!

bharani jella