NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఈ వృద్ధ యోధులుపై బీజేపీకి ఎందుకీ కక్ష ?

 

దేనికైనా అమితుమీ చూసుకునే శత్రువు ఉండాలంటారు. ఆడవాళ్ళ పై, చిన్నారులు, వృద్ధులపై యుద్ధం నీతి కాదు అంటారు. బీజేపీ మాత్రం మావోయిస్టు ఉద్యమం, కేసులు, సహకారం పేరుతో వృద్దులు, దివ్యాంగులతో ఆటలాడుతోంది. వారి జీవితాలతో చెలగాటం చేస్తోంది. విరసం నేత, హక్కుల ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడిగా ముద్ర ఉన్న వరవరరావు, ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వారిపై ఉన్న కక్షను బయట పెట్టెల కనిపిస్తుంది. సాయుధ ఉద్యమాల కోపాలను వ్యక్తిగతంగా చూపడం వల్ల రాజ్యంలోని కొందరు తమ హక్కులు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల నుంచే ఉద్యమాలు పుడతాయని కొందరు గుర్తు చేస్తున్నారు.

ఎందుకీ ద్వేషం ??

వరవరరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన హక్కుల ఉద్యమకుడు. విప్లవ రచయితల సంఘంలో కీలక వ్యక్తి. మావోయిస్టు పార్టీతోనూ సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్యమ నాయకులూ వరవరరావు కు తెలిసిన వారే. ఆంధ్ర లో మావోయిస్టు పార్టీ బలంగా ఉన్న సమయంలో వరవరరావు కొన్ని అంశాల్లో ఉద్యమకారులకు సహకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సల్స్ ను చర్చలు ఆహ్వానించినపుడు నక్సల్స్ తరఫున చర్చల్లో వరవరరావు కీలకంగా వ్యవహరించారు. దాని తర్వాత ఆయన యధావిధిగా తన పనిలో నిమగ్నమైనా ఏ ప్రభుత్వం ఎప్పుడు నిర్బంధించిన దాఖలాలు లేవు. కేవలం విరసం, ఇతర ఉద్యమ సభల్లో మాత్రమే పాలు పంచుకునే వారు. ప్రస్తుతం ఆయన వయసు 81 . కొన్ని దీర్ఘకాలీక వ్యాధులు ఉన్నాయి. వేగంగా నడవలేరు. ఇలాంటి సమయంలో ఆయనను ప్రభుత్వం ఒక సభకు హాజరు అయ్యారనే నెపంతో అరెస్ట్ చేసింది. 2017 లో పుణెలోని ఎల్లార్ పరిషత్ సభలో పాల్గొన్న ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జైల్లో వేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిత్యం క్షిణిస్తూనే ఉంది. కరోనాతోను 81 ఏళ్ల వయసులో యుద్ధం చేసి గెలిచిన వరవర రావు ప్రస్తుతం వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా ఇబ్బంది పడుతుంటే ఇప్పటికి 8 సార్లు వేసిన బెయిల్ పిటిషన్స్ ను కోర్టు కొట్టేసింది. ఆయన ఆరోగ్యం మీద వైద్యులు సైతం ప్రమాదం అని రిపోర్టులు ఇచ్చిన వాటిని పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులు వేస్తున్న పిటిషన్ ల వల్ల కోర్టు బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా బెయిల్ పిటిషన్ లు నిలవడం లేదు. ఇటీవల కోర్టు ఆయన ఆరోగ్యం రీత్యా ముంబై నానావతి ఆస్పత్రికి తరలించాలని పోలీస్ లను ఆదేశించింది. అయితే బెయిల్ విషయాన్నీ తోసిపుచ్చడం విశేషం. కేంద్రం కావాలనే ఉద్యమకారులకు ఎవరైనా సహకరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో బెదిరించేందుకే వరవరరావు కి ఇలాంటి పరిస్థితి వచ్చేలా కావాలని చేస్తుంది అని ఉద్యమకారులు భావిస్తున్నారు.

సాయిబాబా ది అంతే పరిస్థితి

ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో సైతం ఇలాంటి స్థితి కొనసాగుతుంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతూ కనీసం తన పని తానూ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సాయిబాబా మీద 2014 లో
కేసు పెట్టి చిత్రవధ పెట్టారు. వెలుతురూ కూడా దురని అండ బ్యారెక్ లో వేసి ఆయనపై కక్ష తీర్చుకున్నారు. ఎన్నో ఉద్యమాలు, ఆందోనళన, సోషల్ మీడియా ప్రచారం చేసిన ఫలితం లేకపోయింది. కేవలం ఆయన ఇంట్లో దొరికిన కొన్ని పుస్తకాలు, హార్డ్ డిస్క్లు ఆధారంగా మావోయిస్టు పార్టీతో సంబంధాలు కేసు పెట్టిన ఆయనకు జైల్లో కరోనా వచ్చిన బెయిల్ ఇచ్చేందుకు
నాగపూర్ బెంచ్ నిరాకరించింది. దింతో ఆయన సైతం తీవ్ర మానసిక వ్యాధితో పాటుఇతర ఆరోగ్య సమస్యలతో క్రుంగి కృశించిపోతున్నారు.

వరవరరావును, ప్రొఫెసర్ సాయిబాబాను నిర్బంధం వెనుక రాజ్యం ఒకటే ఆలోచన చేస్తుంది. ఉద్యమాన్ని నియంత్రించాలంటే మైదాన ప్రాంతాల్లో ఉన్న వారి మద్దతుదారులను ఇబ్బంది పెట్టాలి. అడవుల్లో ఉన్నవారికి ఇలాంటి సహాయం అందకుండా చూడాలి. దీనివల్ల సాయుధ పోరాటం చేసే వారి మీద మానసిక యుద్ధం మొదలు పెట్టినట్లే. దీని వల్ల కొత్తగా ఉద్యమంలోకి వెళ్లేవారు తక్కువ అవుతారనే స్ట్రాటజీ కేంద్రానిది అయితే, ఈ మైండ్ గేమ్ కోసం వృద్దులు, దివ్యంగుడు అయిన చదువుకున్న బ్యాక్తిని క్షోభ పెట్టడం, కనీస మానవత్వం మరవడం బీజేపీ పెద్దల నీతిని బయట పెడుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?