NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మరో పథకాన్ని ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్..

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి బుధవారం 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలను ఆన్ లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు అనేక మంది వడ్డీతో అప్పులు తెచ్చుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. స్వయం సహాయక సంఘాల మాదిరిగా పది వేలు తీసుకున్న లబ్దిదారులు సక్రమంగా బ్యాంకులకు రుణాలను చెల్లించి మళ్లీ రుణాలు పొందవచ్చని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి లబ్దిదారుడి ఖాతాలో వడ్డీ సొమ్ము జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద రోడ్డు పక్కన రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్డు పక్కన టీ, టిఫిన్ తదితర చిన్న చిన్న దుకాణ దారులు అర్హులని చెప్పారు. ఈ పథకం కింద ప్రస్తుతం జాబితాలో పేరు లేని వారు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటే వారికీ ఈ వడ్డీ లేని రుణాలు అందుతాయని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్ లు అర్హులను గుర్తించి రుణం మంజూరు అయ్యేలా చర్యులు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి  మంత్రులు, కలెక్టర్‌లు, ఎమ్మెల్యేలు, లబ్దిదారులు పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులు ఈ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డికి ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N