NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అదిరిపోయే కాషాయ వ్యూహం : గ్రేటర్ పోరులో అందరికి గేలం

 

 


గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెంచుతోంది. మహానగరంలో ఉన్న వివిధ వర్గాల వారిని ఆకట్టునే లక్ష్యంతో ఆయా వర్గాలతో సంబంధం ఉన్న వారిని తమవైపు తిప్పుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్నికలకు అతి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో పాటు, కచ్చితంగా విజయానికి కావాల్సిన నెంబర్ మార్క్ సాధించే విధంగా నాయకులూ బూత్ ల వారీగా నాయకీలీ పావులు కదుపుతున్నారు. దీనికి తగ్గట్టు గానే నాయకుల ప్రచార షెడ్యూల్ ప్రకటించింది.

వివిధ రాష్ట్రాల వారికీ తగ్గట్టుగా

హైద్రాబాద్ మహానగరంలో దాదాపు అన్ని నగరాల వారు కనిపిస్తారు. వివిధ పనుల నిమిత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడికి చేరుకుంటారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వీరు పలు ప్రాంతాల్లో సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి హైదరాబాద్లో ఓట్ హక్కు ఉంది. సాఫ్ట్ వెర్ వారి దగ్గర నుంచి కిళ్ళీ కొట్టు నడిపేవారి వరకు ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారే ఉంటారు. వీరే 5 లక్షల మంది కనిపిస్తారు. హైద్రాబాద్ జనాభా 2019 లో 97 లక్షలు ఉంటే 2020 కోటి దాటింది. వీరిలో 5 లక్షల మేర ఓట్లు కీలకం అవుతాయి. హైద్రాబాద్ లో కనిపించే ప్లంబర్ లలో ఒడిస్సా నుంచి వచ్చి పని చేసుకుంటున్న వారే. అలాగే గప్ చుప్ బళ్ళు, పానీపూరి బళ్ళు నడిపేవారిలో ఎక్కువ మహారాష్ట్ర నుంచి వచ్చేనా వారే. ఇలా విభిన్నమైన పనులు చేయుకుంటూ ఉన్న వారిని తమవైపు తిప్పుకునే వ్యూహంతో బీజేపీ నాయకులను ఆయా రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. భారీ బహిరంగ సభలు ఏవి లేకుండా వార్డుల్లో ప్రచారం చేయిస్తూ, వివిధ రాష్ట్రాల వారు ఉన్న చోట వారితో మాట్లాడించేలా, బీజేపీకు వోట్ వేయేంచేలా హామీ తీసుకోనున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల ఓటర్ల ఓట్లు అన్ని గంపగుత్తగా సాదించేందుకు బీజేపీ నాయకులందరినీ షెడ్యూల్ ప్రకారం గ్రేటర్ ప్రచార బరిలోకి దింపాలని యోచిస్తోంది.

గతం లా పట్టు విడవొద్దని..

బీజేపీ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలో కచ్చితమైన స్ట్రాటజీ ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మాత్రమే తెరాసకు ప్రధాన పక్షంగా ఒక ఊపు వచ్చింది. గతంలో 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్లో యెన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీ తరఫున గెలిచినప్పుడు వచ్చిన ఊపు ఇప్పుడు కనిపిస్తుంది. అప్పట్లో జాతీయ నాయకత్వం అదే హుషారును ముందుకు తీసుకువెళ్లే విషయాన్నీ పట్టించుకోకపోవడంతో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ గుంపులో గోవిందంలా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడు దుబ్బాక గెలుపు అనంతరం వచ్చిన ఈ ఊపును మాత్రం జారవిడుచుకోకూడదని, దక్షిణాదిలో బలపడటానికి వచ్చిన ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని, అప్పుడే బీజేపీ ఉత్తరాదిలో కాస్త బలహీనం అయినా, దక్షిణాదిలో కవర్ చేస్కునే అవకాశం ఉంటుంది అనేది కమలనాధుల ఆలోచన. దీనికి గ్రేటర్ ఎన్నికలు ఎంతో ఉపయోగపడతాయని కచ్చితంగా హైద్రాబాద్ మేయర్ పీఠం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణ అంతటా నే కాకుండా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైద్రాబాద్ గెలిస్తే ఆంధ్రాలో సైతం ఆ ప్రభావం కనిపిస్తుందని, తెరాస పార్టీకు ప్రధాన పక్షంగా జనం విశ్వసిస్తారని బీజేపీ భావిస్తోంది. అందుకే ఎప్పుడు లేనట్లుగా ఈ సరి జాతీయ నాయకత్వం అంత ఒక మేయర్ పీఠం కోసం ప్రచారానికి తరలి రావడం ఇదే తొలిసారి. మరోపక్క విజయానికి చక్కటి ప్లాన్ వేస్తారని పేరున్న భూపేంద్ర యాదవ్ సైతం హైద్రాబాద్ పరిస్థితి గెలుపు అవకాశాలను నిశితంగా పరిశీలిస్తూ ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే 5 మందితో కొర్ టీమ్ ప్రకటించిన భూపేంద్ర యాదవ్ సైతం నేతలకు ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది..? ఆయా వర్గాలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఎలా తమ వైపు తిప్పుకోవాలనే దానిపై తరుచు వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి చేస్తున్న తప్పిదాలనే కాకుండా, తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేకుండా ముందుకు సాగేలా చూస్తున్నారు. ఎలాగైనా హైద్రాబాద్ గెలిచి దక్షిణాదిలో బలం పుంజుకునే వ్యూహానికి హైద్రాబాద్ గెలుపు పెద్ద మైలేజి అవ్వాలని బీజేపీ భావిస్తోంది.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju