NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

డాక్ట‌ర్ ర‌మేష్ విచార‌ణ …. స్వ‌ర్ణ ప్యాలెస్ గుట్టు ర‌ట్టు కానుందా?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య‌వాడలో రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్ర‌మాదం గురించి తెలిసిన సంగ‌తే. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేయ‌డం, అనంత‌రం జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మంది గాయపడటం అనేక మందిని నివ్వెర‌ప‌రిచింది.

 

ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి డా.రమేష్‌బాబును ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతించింది.

అస‌లేం జ‌రిగింది?

క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్రైవేటు కేంద్రాల‌కు సైతం అనుమ‌తి ఇచ్చింది. ఇలా అనుమ‌తి పొందిన వాటిలో విజయవాడలోని స్వర్ణప్యాలెస్ ఒక‌టి. అయితే, రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆగస్టు 9న భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదం వ‌ల్ల 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి రమేష్ ‌బాబు పోలీసులకు అందుబాటులోకి రాలేదు.

అప్ప‌టి నుంచి అజ్ఞాతంలోనే…

అగ్ని ప్రమాదం, త‌దుప‌రి విచార‌ణ నేప‌థ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా విచారణకు అనుమతిచ్చింది. మూడు రోజుల పాటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌‌లో విచారణ చేయొచ్చని పేర్కొంది. ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని సూచించింది. కోవిడ్ నేపథ్యంలో విచారణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విచార‌ణ‌తో అస‌లు ఏం జ‌రిగింద‌నే అంశం వెలుగులోకి రావ‌చ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!