కొరటాల రాసుకున్న కథ కి అల్లు అర్జున్ సరిపోతాడా .?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా రాం చరణ్ ఈ నిమా షూటింగ్ లో జనవరి నుంచి జాయిన్ కాబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Acharya' First Look: Megastar Chiranjeevi stands tall in the new poster of  his upcoming film

ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కొరటాల శివ నెక్స్ట్ సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతుండగా ఇప్పటికే ఈ సినిమా అధికారక ప్రకటన కూడా వచ్చింది. కాగా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో 21వ సినిమాగా రాబోతోంది. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్కెట్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమాగా అల్లు అర్జున్ సన్నిహితులు శాండీ, స్వాతి, నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.

AA21 Movie First Look | Allu Arjun With Koratala Siva First Look | Allu  Arjun New Movie - YouTube

ఇక ఈ సినిమాని కూడా కొరటాల సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతుండగా 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. కొరటాల ఈ సినిమాలో అల్లు అర్జున్ ని పొలిటికల్ లీడర్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ని ముఖ్యమంత్రిగా చూపించి సూపర్ హిట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కి స్టైలిష్ క్యారెక్టర్ రాసినట్టు సమాచారం.

కొరటాల శివ తెరకెక్కించే కథ లన్ని సామాజిక అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి. ఇక హీరోయిజం కూడా హై ఓల్టేజ్ లో ఉంటుంది. అంతేకాదు సినిమాని ఎంతో బాధ్యతగా తీస్తాడు. ఇప్పటి వరకు కొరటాల నుంచి వచ్చిన సినిమాలన్ని విమర్శకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ని కూడా స్కై రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఎనర్జీ తో సినిమా ఇంకో లేవర్ల్ కి వెళ్ళడం గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది.