ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించే దిశగా ఒక్కో అడుగు పడుతూనే ఉంది. గతంలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నది. తాజాగా మరో దేశం కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసింది.
త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఆ దేశం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. బ్రిటన్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది మరియు ప్రాధాన్యత క్రమంలో వాటిని తమ దేశ ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
మెసెంజర్ RNA సాంకేతికతో ఫార్మా దిగ్గజం అయిన ఫైజర్ ఇంక్ ఈ వాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌కు MHRA అనుమతి ఇవ్వడంతో యూకే ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
యూకే ప్రభుత్వం ఆదేశించినందున MHRA, వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల డేటాను విశ్లేషించి ఎలా పనిచేస్తుందో పరిశీలించిన తరువాతనే ఆమోదించింది.