NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పుండు మీద కారం చ‌ల్లిన మోదీ .. ఎన్ని గుండెలో క‌దా?

రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న వారిలో ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ నేటి భార‌త్ బంద్ గురించి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి.

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా వివిధ రాజ‌కీయ‌ ప‌క్షాలు భార‌త్ బంద్ కు మ‌ద్ద‌తు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. అయితే, ఈ బంద్ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రైతుల బంద్‌…

కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఐదు సార్లు విఫలం కావడంతో.. భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.. ఇక, రేపు జరగనున్న భారత్‌ బంద్‌కు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి.. దేశ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలు, ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతూనే ఉన్నారు. భార‌త్ బంద్‌ మంగ‌ళ‌వారం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. భారత్‌ బంద్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మోదీ ఏమ‌న్నారంటే…

ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్‌ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు అత్యావశ్యకం అని ప్రధాని నరేంద్ర మోదీ.. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా… సంస్కరణలు అవసరమన్న ఆయన.. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమన్న ఆయన.. శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని పేర్కొన్నారు. సంస్కరణలనేవి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ, గత శతాబ్దంలో కొన్ని చట్టాలు ఉపయోగంలో ఉండేవి.. కానీ, ఈ శతాబ్దానికి అవి భారంగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక, గతంలో సంస్కరణలు కొన్ని రంగాలకే పరిమితం అయ్యావి.. కానీ, తమ సర్కార్‌ మాత్రం అన్ని రంగాల్లో సంస్కరణలను విస్తరించినట్టు భారత ప్రధాని చెప్పుకొచ్చారు. కేంద్ర సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయడంతో.. భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ కామెంట్లు రైతుల పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు.

 

 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N